తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ex Cs Somesh Kumar: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌‌పై కేసు నమోదు, వాణిజ్య పన్నుల శాఖ‌లో అక్రమాలే కారణం

Ex CS Somesh Kumar: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌‌పై కేసు నమోదు, వాణిజ్య పన్నుల శాఖ‌లో అక్రమాలే కారణం

Sarath chandra.B HT Telugu

29 July 2024, 6:36 IST

google News
    • Ex CS Somesh Kumar: తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌పై కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్‌ కోర్టు తీర్పుతో ఏపీకి వెళ్లి ఆపై స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 
తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌పై కేసు నమోదు
తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌పై కేసు నమోదు

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్ కుమార్‌పై కేసు నమోదు

Ex CS Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర‌్శి సోమేష్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో దాదాపు రూ.1000 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది. తెలంగాణ కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్ అడిషనల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120(బి) ఐటీ చట్టం కింద సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండగా సోమేశ్‌కుమార్‌ ప్రధాన కార్యదర‌్శిగా పనిచేశారు. హైకోర్టు తీర్పుతో ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఏడాది సర్వీసు ఉండగానే ఆయన ఏపీలో స్వచ్ఛంధ పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జీఎస్టీ పన్ను లావాదేవీల్లో జరిగిన అవినీతిలో మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ ఎస్.వి. కాశీవి శ్వేశ్వరరావు, హైదరాబాద్‌ రూరల్ డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమి టెడ్‌ నిర్వాహకుల్ని నిందితులుగా ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈకేసులో అయిదో నిందితుడిగా సోమేశ్ కుమార్‌ పేరును చేర్చారు. పన్ను ఎగవేతదారుల సహకరించడం ద్వారా రూ. వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు జాయింట్ కమిషనర్ కానూరి రవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేతతో వాణి జ్యపన్నుల శాఖకు రూ.1,000కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు రూ.400కోట్లు ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీప్‌ టెక్నాల జీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండా రూ.25.51కోట్ల ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్నట్టు గుర్తించారు. వాణిజ్యపన్నుల శాఖకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరా బాద్ వ్యవహరించింది.దీంతో ఐఐటీ సిబ్బందిపై కూడా కేసు నమెదు చేశారు.

బిగ్ లీప్‌లో జరిగిన అక్రమాలను గుర్తించిన వాణిజ్యపన్నుల శాఖ గత ఏడాది డిసెంబరు 26న ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ నిర్వహించారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీతో పాటు ఎస్.వి.కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ మౌఖిక ఆదేశాలతోనే అక్రమాలను గుర్తించకుండా వాణిజ్య పన్నుల శాఖకు సరఫరా చేసిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. జీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా మార్పులు చేయడంతో గా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో వివరించారు. ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలోని ప్లియాంటో టెక్నాల జీస్ ద్వారా సాఫ్ట‌‌వేర్‌ అభివృద్ధి చేశారు.

వాణిజ్య పన్నుల శాఖ నివేదిక ఆధారంగా ఏసీ కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల నుంచి వివరణ కోరారు. సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే మార్పులు చేయాలని ఐటీ సంస్థకు తాము సూచించినట్లు వారు వివరణ ఇచ్చారు. మరోవైపు వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించి తాము ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయలేదని ప్రియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. గతజనవరిలో ఈ వ్యవహారంపై ఆడిట్ జరిపించారు. కమర్ఫషియల్ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ డేటాను ఐఐటీ హైదరాబాద్‌ నిర్వహిస్తున్నట్టు,దానిలో మార్పుు చేసే అవకాశం ఉందని గుర్తించారు. ఈ క్రమంలో అధికారుల మధ్య నడిచిన వాట్సప్‌ చాట్‌ హిస్టరీలను కూడా సేకరించారు. సోమేశ్‌ కుమార్‌, కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల మధ్య నడిచిన వాట్సప్ సందేశాలను సేకరించారు. ఈ వ్యవహారంలో అక్రమాలను నిర్దారించే ఆధారాలు సేకరించిన తర్వాత కేసులు నమోదు చేశారు.

తదుపరి వ్యాసం