తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : హన్మకొండలో కాల్పుల కలకలం..! అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్

Warangal : హన్మకొండలో కాల్పుల కలకలం..! అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్

12 October 2023, 14:51 IST

google News
    • Hanamkonda District Crime News: హన్మకొండ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో సొంత అత్తను తుపాకీతో కాల్చి చంపాడు అల్లుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కేయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌
అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ (Twitter)

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

Hanamkonda : వరంగల్ నగరంలో దారుణం జరిగింది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం... ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత అత్తనే కాల్చి చంపాడు అల్లుడు. అతడు ప్రస్తుతం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

కేయూ పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.... హన్మకొండ జిల్లాలోని గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. ప్రసాద్ ప్రస్తుతం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొంత కాలంగా వీరి మధ్య విబేధాలు తలెత్తాయి. గత మూడేళ్లుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే కాకుండా... అత్తతో డబ్బుల విషయంలో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గురువారం కానిస్టేబుల్ ప్రసాద్‌ గుండ్ల సింగారంలోని తన అత్తగారి ఇంటికి వచ్చాడు. తనతో పాటు తుపాకీని కూడా తీసుకొచ్చాడు. డబ్బుల అంశంతో పాటు కుటుంబ కలహాల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.కోపోద్రిక్తుడైన ప్రసాద్‌... తనతో పాటు తీసుకొచ్చిన తుపాకీతో అత్త కమలమ్మపై కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ ప్రస్తుతం రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

తదుపరి వ్యాసం