తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Complaint: బీజేపి, బీఆర్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు

Congress Complaint: బీజేపి, బీఆర్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu

13 December 2023, 7:34 IST

google News
    • Congress Complaint: తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపి మరియు బీఆర్ఎస్ పార్టీలు కలిసి కూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయని రాష్ట్ర డీజీపీ కి మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

Congress Complaint: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తెలంగాణలో కుట్రలకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. మరో ఆరు నెలల్లోగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఇటీవల వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్,బిఆర్ఎస్ ఎమెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి లపై చర్యలు తీసుకోవాలని పిసిసి జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, కాంగ్రెస్ నాయకులు చారకొండ వెంకటేష్,మధుసూదన్ లు రాష్ట్ర డిజిపి రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు.

డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు..

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బిజేపి, బిఆర్ఎస్ పార్టీలు కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాయాని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.అందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. ఈ మేరకు డిజిపి రవి గుప్తాకు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.

మూడు రోజుల క్రితం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ " మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు… కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూద్దాం ఆరు నెలలా…ఒక సంవత్సరామా.. అసలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ లేదు, త్వరలో ఆ పార్టీ కూలిపోవడం ఖాయం " అని అన్నారు. గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ " తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.... కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుంది " అన్నారు.

తుమ్మినా…దగ్గినా కాంగ్రెస్ కూలిపోతుంది : కిషన్ రెడ్డి

జనగాం బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ " వచ్చే ఏడాది మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమని.. కాంగ్రెస్ నాయకులు వారికి వారే తమ ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటారు " అని అన్నారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. తుమ్మినా దగ్గినా కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

మరోవైపు కొన్ని మీసేవా కేంద్రాల్లో ఆరు హామీల కార్డులు ముద్రిస్తున్నారు. వాటిపై పథకం పేరు, పార్టీ గుర్తు, స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లేదా పోటీ చేసిన అభ్యర్థి ఫొటో, లబ్ధిదారుని పేరు, ఫోన్‌ నంబరు ముద్రించి ఇస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. సోమవారం షాద్‌నగర్‌లో 'మహాలక్ష్మి'కి సంబంధించిన నకిలీ కార్డులు వెలుగులోకి రాగా..

తాజాగా మంగళవారం గోషామహల్‌లోనూ గుర్తించినట్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సునీతారావు, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ గాంధీభవన్‌లో విలేకరులకు తెలిపారు. ఒక్కో కార్డుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు. దీనిపై గోషామహల్‌ ఠాణాలో, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి కార్డులు జారీ చేయలేదన్నారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం