తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Prajapalana: నేడు సచివాలయంలో " ప్రజాపాలన " వెబ్ సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్

Prajapalana: నేడు సచివాలయంలో " ప్రజాపాలన " వెబ్ సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్

HT Telugu Desk HT Telugu

08 January 2024, 6:27 IST

google News
    • Prajapalana: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన కోసం వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది.
ప్రజాపాలన దరఖాస్తుల నమూనా విడుదల చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ప్రజాపాలన దరఖాస్తుల నమూనా విడుదల చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

ప్రజాపాలన దరఖాస్తుల నమూనా విడుదల చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

Prajapalana: కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీ పథకాల అమలు కోసం డిసెంబర్ 28 తేదీ నుండి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై నేడు అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,రాష్ట్ర మంత్రులు, ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు.

ప్రజాపాలన లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీల కు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు రాగా, ఇతర అభ్యర్థనల కు సంబంధించి 19,92,747 దరఖాస్తులు ఉన్నాయి.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా.....గ్రామ సభల్లో మొత్తం 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు..

ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు అంటే ( లక్షల్లో )

• హైదరాబాద్ - 13.7

• రంగారెడ్డి - 10.2

• మేడ్చల్ - మల్కాజిగరి - 9.2

• నల్గొండ - 6.1

• నిజామాబాద్ - 5.9

• ఖమ్మం - 5.5

• సంగారెడ్డి - 4.4

• మెదక్ - 2.73

• సూర్యాపేట - 4.2

• జగిత్యాల - 3.9

• కరీంనగర్ - 3.5

• సిద్దిపేట - 3.8

• కొత్తగూడెం - 3.7

• వరంగల్ - 3.3

• మహబూబ్ నగర్ - 3.2

• వికారాబాద్ - 3.1

• మహబూబాబాద్ - 3.1

• హన్మకొండ - 2.93

• మంచిర్యాల - 2.83

• నిర్మల్ - 2.80

• పెడ్డపెల్లి - 2.69

• భువనగిరి - 2.65

• అదిలాబాద్ - 2.54

• సిరిసిల్ల - 2.20

• ములుగు - 1.10

• నారాయణపేట - 2.15

• జనగామ - 2.09

• నాగర్ కర్నూలు - 1.95

• వనపర్తి - 2.03

• గద్వాల్ - 1.95

• ఆసిఫాబాద్ - 1.82

• భూపాలపల్లి - 1.46

• కామారెడ్డి -3.1

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

తదుపరి వ్యాసం