తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana: అమర జ్యోతి ప్రారంభం... ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసిన సీఎం కేసీఆర్

Telangana: అమర జ్యోతి ప్రారంభం... ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసిన సీఎం కేసీఆర్

22 June 2023, 20:52 IST

google News
    • Telangana Martyrs’ Memorial:అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 
అమ‌రుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
అమ‌రుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

అమ‌రుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

Telangana Martyrs’ Memorial: హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ సర్కార్.... నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా... అమరవీరులకు గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల‌పై ప్ర‌ద‌ర్శించిన ప్ర‌ద‌ర్శ‌న‌ను తిలకించారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులను సీఎం, మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్…. తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని గుర్తు చేశారు. ఉద్యమంలో భాగంగా తనపై జరిగిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపై జరిగి ఉండదని.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని అన్నారు. తన నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందని…. ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయని చెప్పారు. తొలిసారిగా ఖ‌మ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్య‌మ పొలికేక రావ‌డం…. అక్క‌డ్నుంచి 1965, 1966 నుంచి మొద‌లుకొని 1967 నాటికి యూనివ‌ర్సిటీల‌కు చేరుకోవ‌డం జ‌రిగిందన్నారు. కేసులు, వేధింపులు, భ‌యంక‌ర‌మైన పీడీ యాక్టులు, ఉద్యోగుల బ‌ర్త‌ర‌ఫ్‌లు, అనుభ‌వించిన బాధలే నేటి తెలంగాణ‌ అని కేసీఆర్ వ్యాఖ్యనించారు.

అమరులకు సీఎం కేసీఆర్ నివాళులు

ఆజ‌న్మ తెలంగాణ‌వాది ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు సీఎం కేసీఆర్. ఆయన మార్గదర్శనంలోనే నడిచామని… ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్‌ కాపాడుకొంటూ వచ్చారు కొనియాడారు.లెఫ్ట్ పార్టీలు కూడా ఉద్య‌మానికి జీవం పోశాయన్న కేసీఆర్…. ఉద్య‌మాన్ని స‌జీవంగా ఉంచేందుకు అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ అమరవీరుల స్మారకం
తదుపరి వ్యాసం