తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr Kondagattu Tour:మరో ఆలయానికి మహర్ధశ.. 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్

CM KCR Kondagattu Tour:మరో ఆలయానికి మహర్ధశ.. 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu

12 February 2023, 6:05 IST

google News
    • CM KCR Latest News: ఈనెల 14న సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ఖరారైంది.ఈ మేరకు అధికార యంత్రాగం ఏర్పాట్లు చేస్తున్నారు.
కొండగట్టుకు సీఎం కేసీఆర్
కొండగట్టుకు సీఎం కేసీఆర్

కొండగట్టుకు సీఎం కేసీఆర్

cm kcr to visit kondagattu anjaneyaswamy temple: తెలంగాణలోని మరో ఆలయానికి మహర్దశ రాబోయే సమయం అసన్నమైంది. ఇప్పటికే యాదాద్రిని రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దింది తెలంగాణ సర్కార్. మాస్టర్ ప్లాన్ రూపొందించి... సమూల మార్పులు చేసింది. పనుల ప్రగతిని నిత్యం పర్యవేక్షించిన సీఎం కేసీఆర్... ఎప్పటికప్పుడూ సమీక్షలు, సూచనలు చేస్తూనే వచ్చారు. పలుమార్లు స్వయంగా యాదాద్రికి వెళ్లిన ఆయన... పనుల ప్రగతి పరిశీలించారు. అధికారులను పరుగులు పెట్టించారు. వాటన్నింటి ఫలితమే నేటి యాదాద్రి అన్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ ఆలయమైన కొండగట్టు అభివృద్ధి కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

14న కొండగట్టు పర్యటన...

ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్... జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇదే సమయంలో ఆలయ అభివృద్దికి సంబంధించిన పనులపై చర్చిస్తారని సమాచారం. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్‌ ఆనంద్‌ సాయి కూడా ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ పనులను కూడా ఆనంద్ సాయికే అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దేవస్థానం అభివృద్ధికి రూ. 100కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొండగట్టు టూర్ ఖారారైనే నేపథ్యంలో... ఆలయానికి మహర్దశ రావటం ఖాయంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.

మరోవైపు సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ భాస్కర్ హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. మిగత శాఖల అధికారులు కూడా ఏర్పాట్లల్లో నిమగ్నం అయ్యారు.

తదుపరి వ్యాసం