కేజ్రీవాల్ తో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్..
22 May 2022, 12:54 IST
- దేశవ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అక్కడే భోజనం చేశారు. ఇద్దరి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ - కేజ్రీవాల్ (ఫైల్ ఫొటో)
ఢిల్లీ ఉన్న సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. శనివారం అఖిలేశ్ తో భేటీ, సాయంత్రం ఢిల్లీలోని సర్వోదయ పాఠశాలను సందర్శించిన ఆయన.. ఇవాళ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. ఇద్దరి మధ్య జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వం విధానాలతో పాటు తదితర అంశాల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపట్లో ఛండీగఢ్ కు…
కేజ్రీవాల్ నివాసంలో భేటీ ముగిసిన తరువాత ఇరువురు సీఎంలు వారి బృందాలతో చండీగఢ్ కు వెళ్తారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన రైతు కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా పాల్గొననున్నారు. సీఎం కేసిఆర్ బృందంలో.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ తదితరులున్నారు.
మరోవైపు ఈ నెల 26న మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ బెంగళూర్‌లో సమావేశం కానున్నారు. ఆ తర్వాత మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో పర్యటిస్తారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన వీర పోరాటంలో అమరులైన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.