తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Crime: నిర్లక్ష్యంగా తాగి పడేసిన సిగరెట్టు పీక, తెలంగాణ తల్లి విగ్రహానికి మంటలు, నిందితుడి అరెస్ట్

Siddipet Crime: నిర్లక్ష్యంగా తాగి పడేసిన సిగరెట్టు పీక, తెలంగాణ తల్లి విగ్రహానికి మంటలు, నిందితుడి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

03 October 2024, 8:41 IST

google News
    • Siddipet Crime: మద్యం మత్తులో సిగరెట్టు తాగి నిర్లక్ష్యంగా ఆ సిగరెట్టు పీక అక్కడ పడేసి వెళ్ళి పోయాడు. ఈ ఆకతాయి పని వల్ల అక్కడే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంపై కప్పిన ముసుగు కాలి.. విగ్రహం కొంతభాగం కాలిపోయింది. సిగరెట్టూ పీకే కదా అని నిర్లక్ష్యంగా అక్కడ పడేసి పోవడం వలన ఆ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.
మద్యం మత్తులో సిగరెట్ట పీక పడేసిన వ్యక్తి
మద్యం మత్తులో సిగరెట్ట పీక పడేసిన వ్యక్తి

మద్యం మత్తులో సిగరెట్ట పీక పడేసిన వ్యక్తి

Siddipet Crime: తాగిన సిగరెట్‌ పీకనునిర్లక్ష్యంగా పడేయడంతోతెలంగాణ తల్లి విగ్రహానికి మంటలు చుట్టుముట్టాయి. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌటపల్లి గ్రామంలో బురుజు చౌరస్తా వద్ద కొన్ని నెలల కిందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రారంభం చేయకపోవడంతో విగ్రహానికి ముసుగు కప్పారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ముసుగు కాలి బూడిద కాగా విగ్రహం కొంతభాగం కాలిపోయింది. 

ఈ ఘటనపై సోమవారం ఉదయం టిఆర్ఎస్ నాయకులు అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ విజయ భాస్కర్ దర్యాప్తు ప్రారంభించారు. కేసు పరిశోధనలో భాగంగా గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ....

టెక్నాలజీ ఉపయోగించి తెలంగాణ తల్లి విగ్రహం ముసుగును అంటుపెట్టిన యువకుడు అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కామాద్రి రాంబాబు (34) గా గుర్తించి, అతనిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం నిందితున్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారించారు. పోలీసుల విచారణలో తానే మద్యం తాగిన మత్తులో సిగరెట్టూ తాగి పీక అక్కడ వేసి వెళ్ళిపోయాను. ఆ పీక అంటుకొని తెలంగాణ తల్లి విగ్రహం ముసుగు కాలిపోయిందని ఒప్పుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

కూతురి హత్య కేసులో తండ్రికి జీవిత ఖైదు....

కన్న కూతురిని హత్య చేసిన కేసులో తండ్రికి జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ న్యాయమూర్తి భవాని చంద్ర తీర్పు వెలువరించారని సదాశివపేట సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాకు చెందిన కట్రోత్ రవినాయక్ మొదటి భార్య చనిపోవడంతో .. రెండవ పెళ్లి చేసుకున్నాడు. అతడు రెండవ భార్యతో కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కాగా మొదటి భార్య కూతురు రేణుక వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలంలోని కస్తూర్బా లో 8 వ తరగతి చదువుతుంది.

ఈ క్రమంలో కూతురు రేణుక ఆరోగ్యం బాగాలేదని చికిత్స నిమిత్తం 2020లో పాఠశాల నుండి సదాశివపేటకు వచ్చింది. చికిత్స అనంతరం తిరిగి పాఠశాలకు తీసుకెళ్లేటప్పుడు తండ్రి మార్గమధ్యలో గొంతు నులిపి హత్య చేసి, జ్వరంతో చనిపోయిందని అందరిని నమ్మించాడు. మెడపై గాయాలుండడంతో అనుమానం వచ్చిన అప్పటి వీఆర్ఓ పోలీసులకు పిర్యాదు చేసాడు. 

దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడి అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతనిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు. కాగా మంగళవారం కేసు పూర్వపరాలను విన్న గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ న్యాయమూర్తి భవానీ చంద్ర నిందితునికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని సీఐ వివరించారు.

తదుపరి వ్యాసం