తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌... స్పాట్ లో ఎక్సైజ్ సీఐ మృతి

Hyderabad : కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌... స్పాట్ లో ఎక్సైజ్ సీఐ మృతి

14 February 2024, 11:06 IST

google News
    • Excise Ci Dead in LB Nagar: ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ ప్రాణాలు కోల్పోయారు. మరో ఎస్సైకు తీవ్ర గాయాలు అయ్యాయి. 
ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం
ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం

ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం

Road Accident in Lb Nagar: హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు… బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ స్పాట్ లోనే మృతి చెందారు. ఎస్సై మొహినుద్దీన్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతి చెందిన సాధిక్ ఛార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మొహినుద్దీన్ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సీఐ సాధిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్‌ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నట్లు తెలిసింది. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి క్వార్టర్స్‌కు వెళుతుండడగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడ్నుంచి పరారీ కాగా….. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.

హోంగార్డు మృతి….

Home Guard Dead : నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ ఛలో నల్గొండ బహిరంగ సభలో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు మృతి చెందారు. మంగళవారం కేసీఆర్‌ సభ ముగిసిన తర్వాత చిట్యాలలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో కలిసి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారును మరో కారు ఢీకొంది. ఫలితంగా పోలీస్ సిబ్బంది పైకి లాస్య నందిత కారు దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న కిశోర్ ప్రాణాలు కోల్పోయాడు.మరో హోంగార్డుకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందితకు కూడా గాయాలు కాగా…. మరో కారులో హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం