తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsreirb Results: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలకు నేటినుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TSREIRB Results: తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలకు నేటినుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

Sarath chandra.B HT Telugu

09 February 2024, 8:15 IST

google News
    • TSREIRB Results: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగ నియామకాల రాత పరీక్ష‌లో ఉత్తీర్ణులైన వారికి నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
TSREIRB ఉద్యోగాలకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
TSREIRB ఉద్యోగాలకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TSREIRB ఉద్యోగాలకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TSREIRB Results: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది ఆగష్టులో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు నిర్వహించింది.

డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు.

రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి శుక్రవారం నుంచి హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌ చైతన్యపురిలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా లా కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు తమతో పాటు నిర్దేశిత ధృవీకరణ పత్రాలను పరిశీలన కోసం తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్, డిగ్రీ పట్టాతో పాటు మార్కుల జాబితా, లైబ్రరీ సైన్స్‌లో ఒరిజినల్ పట్టా, ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ లేకుంటే రెసిడెన్స్, స్థానిక ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం సహా 12 రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఒక్కో పోస్టుకు ఇద్దరి ఎంపిక…

గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు విడుదల చేసింది. తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు, సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో https://treirb.cgg.gov.in/home అందుబాటులో ఉంచింది.

గురుకుల పాఠశాలల్లోని ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ), లైబ్రేరియన్, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా బోర్డు విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలు బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన అభ్యర్థులకు గురుకుల బోర్డు నుంచి రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

https://treirb.cgg.gov.in/home టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌ కాసేపు మొరాయించడంతో అభ్యర్థులు జాబితాలను పరిశీలించుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ఒకేసారి అభ్యర్థులు ఫలితాల తనిఖీకి ప్రయత్నించడంతో ఇబ్బందులు తలెత్తినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసింది. జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను శుక్రవారం నుంచి చేపడతారు.

వివిధ కేటగిరీల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 9వ తేదీన ఉదయం 9గంటల నుంచి చైతన్యపురి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ కళాశాల(ఉమెన్‌)లో పరిశీలన చేపడతారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సుపత్రాలు, సెల్ఫ్‌ అటెస్టేషన్‌ పత్రంతో హాజరు కావాల్సి ఉంటుంది. చెక్‌లిస్టు జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచారు.

14న అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు…

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డెమో పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక పూర్తి చేసక్తారు. గురుకుల జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ ఉద్యోగాలతో పాటు పాఠశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 10వ తేదీ నుంచి డెమో పరీక్షలు నిర్వహిస్తారు.

తుది జాబితాలో అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

తదుపరి వ్యాసం