తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cag Report On Kaleswaram: రూపాయి ఖర్చుతో 52పైసల ప్రయోజనం.. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్.. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్…

CAG Report On Kaleswaram: రూపాయి ఖర్చుతో 52పైసల ప్రయోజనం.. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్.. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్…

Sarath chandra.B HT Telugu

15 February 2024, 13:21 IST

    • CAG Report On Kaleswaram:  తెలంగాణ ప్రభుత్వం కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా దాని వల్ల రాష్ట్రానికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కలేదని కాగ్‌ నివేదిక పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక

CAG Report On Kaleswaram: కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాగ్‌ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Heavy Rain in Hyderabad : ఒక్కసారిగా మారిన వాతావరణం - హైదరాబాద్‌లో కుండపోత వర్షం

TS Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

Online Job Fraud: ఆన్​ లైన్​ జాబ్​ పేరుతో మోసం, 12 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు, వరంగల్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు

TS TET 2024 Hall Tickets : కాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

కాళేశ్వరం రీ ఇంజినీరింగ్‌, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని.. దీంతో రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్‌ తెలిపింది. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ పేరుతో ముందే ప్రారంభించిన ప్రాజెక్టుల్ని ఆపేయడం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది.

సాగునీటి ప్రాజెక్టు పనుల అప్పగింతలో తెలంగాణ నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ అభిప్రాయ పడింది. డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారు.

దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కొన్నారు. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేశారు.. కానీ అది 0.75 శాతంగా తేలుతోందని అభిప్రాయపడింది. అది మరింత తగ్గే అవకాశముంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్‌ బ్యారేజీ నిర్మించారని కాగ్‌ పేర్కొంది.

శాసన సభలో ప్రవేశపెట్టిన నివేదికలో ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పలు అంశాలను ప్రస్తావించారు. డిపిఆర్‌ అమోదించానికి ముందు 25వేల కోట్ల రుపాయల పనులు ప్రారంభించారని కాగ్‌ పేర్కొంది. తొలుత 2టిఎంసిల ఎత్తిపోయాలని ప్రతిపాదించి దానిని 3 టిఎంసీలకు పెంచడంతో 28,151కోట్ల అదనపు వ్యయం ఖర్చైనట్టు పేర్కొన్నారు.

అంచనాలు పాతధరలతో తయారు చేసి డిపిఆర్‌ అమోదం లభించాక, డిజైన్లు మార్చడంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగి పోయిందని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో ఎకరం సాగు చేయడానికి ఆరు లక్షల రుపాయలు ఖర్చవుతుందని, వాన కాలంలో 150టిఎంసిలు నిల్వ చేసినా, యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడుతుందని వివరించారు.

రూ.87,449కోట్ల రుపాయలు రుణాలను కార్పొరేషన్‌ ద్వారా సేకరించారని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి ఆదాయం లేనందున దాని వల్ల ప్రభుత్వానికి తీవ్ర భారంగా మారుతుందన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున చెల్లింపులు వాయిదా వేయాలని కోరారని కాగ్‌ నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేక లోపాలు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది.

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను తప్పబట్టిన కాగ్ ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగిందని తేల్చింది. ఆయకట్టు మాత్రం 52 శాతం మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు చేశారని, ప్రాజెక్ట్‌ వ్యయం రూ.63వేల352 కోట్ల నుంచి రూ.లక్షా 2వేల 267 కోట్లు పెరిగిందని కాగ్ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంతోకలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని అభిప్రాయపడింది.

విద్యుత్‌ అవసరాలకే భారీ వ్యయం…

ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లు అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లు అితే అది భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదని, విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని కాగ్ పేర్కొంది.

2022 మార్చి నాటికి మొత్తం రూ.లక్షా 10వేల 248 కోట్లు అనుమతులు ఇచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో... ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని, ప్రాజెక్ట్ నిధులు సమకూర్చుకోవడం కోసం KICCLఏర్పాటు చేశారని వివరించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలతో KICCL ద్వారా రూ.87,449 కోట్ల రుణాలు సమీకరించారని, KICCL రుణాలపై ఏటా 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని కాగ్ పేర్కొంది. కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం అనుకూలంగా లేదని, ప్రాజెక్ట్ నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వెర్డికల్ ఫాల్ట్ ఉందని ఎన్జీఆర్ఐ ఆధ్యయంలో పేర్కోందని వివరించారు. భూకంపాలపై లోతైన అధ్యయానాలేవి నిర్వహించకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని, 50టీఎంసీల సామర్ధ్యంతో రూ.6వేల126 కోట్లతో మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ నివేదిక పేర్కొంది.

కాళేశ్వరం వాస్తవాలపై ప్రభుత్వ వివరణ…

కాళేశ్వరం ప్రాజెక్టును 7లింకులుగా విభజించారని, ప్రాజెక్టు పనులను 56 కాంట్రాక్టుల కింద అప్పగించారని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన వివరణలో పేర్కొంది. మొత్తం 56 పనుల్లో 2022 మార్చి నాటికి కేవలం 12 పనులు మాత్రమే పూర్తయ్యాయి. 40పనులు సాగుతున్నాయని, వీటిలో పురోగతి 3 శాతం నుంచి 99వరకు ఉందని పేర్కొంంది. 4 పనులు ఇంత వరకు ప్రారంభించలేదని, సివిల్ పనుల మొత్తం విలువ రూ,1,02,267కోట్లు కాగా 2022 నాటికి 69శాతం పనుల్ని రూ.70,666.48కోట్లతో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

కాళేశ్వరం పనులు ఆలస్యం కావడానికి ప్రధానంగా పనుల డిజైన్లు మార్చడం, డ్రాయింగుల్ని ఖరారు చేయడంలో జాప్యం చేయడం, భూసేకరణలో ఆలస్యం కారణాలుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 98,1110.33ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 2022 మార్చి నాటికి 63,972.16ఎకరాలు సేకరించారు. డిస్టిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణంతో పాటు ముఖ్యమైన పనులకు అవసరమైన భూముల సేకరణ ఇంకా కొనసాగుతోంది. 32రకాల పనుల్లో తొలిసారి చేసుకున్న ఒప్పందం గడువు ముగిసినా భూసేకరణ మాత్రం కొలిక్కి రాలేదని వివరించారు. .

ప్రాజెక్టు నిర్మాణం కింద 18.26లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నా 2022నాటి అప్పగించిన పనుల్లో 14.83లక్షల ఎకరాలకు సంబంధించిన డిస్టిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి పనులు మాత్రమే చేర్చారు. అందులో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు 40వేల ఎకరాలు మాత్రమే నని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంది. రీ ఇంజనీరింగ్ చేసి ఆరేళ్లు పూర్తైన 3.43లక్షల ఎకరాల ఆయకట్టు పనులు ఇంకా అప్పగించలేదని తేల్చారు.

ప్రాజెక్టు తాజా అంచనా రూ.1,47,427కోట్లను పరిగణలోకి తీసుకుంటే ప్రాజెక్టు ద్వారా ఒరిగే ప్రయోజనం నిష్పత్తి ప్రతి రుపాయికి 52పైసలు మాత్రమేనని తేల్చారు. పనుల వ్యయం, నిర్మాణంలో చెల్లించాల్సి వడ్డీలు లెక్కెస్తే ప్రాజెక్టుతో ఒరిగే ప్రయోజనాలు ఆదాయం సాగునీటి శాఖ అంచనా కంటే చాలా తక్కువగా ఉంటాయని కాంగ్రెస్‌ చెబుతోంది.

కాళేశ్వరం లిఫ్టులను నడపడానికి 8459మెగావాట్ల విద్యుత్తు అవసరమని, ప్రస్తుతం తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 46.82శాతం కాళేశ్వరం అవసరాలకే సరిపోనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక ఏటా 14,344 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. పంపింగ్ సీజన్‌లో అన్ని పంపుల్ని నడిపితే గరిష్ట విద్యుత్ డిమాండ్ 203.02 మిలియన్‌ యూనిట్లు ఉంటుంది. 2021-22 తెలంగాణ సగటు విద్యుత్ 190.06 మిలియన్‌ యూనిట్ల వినియోగం కంటే అధికమని, ఇది చివరకు గుది బండగా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.

తదుపరి వ్యాసం