BRS Harishrao: అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డికి పిహెచ్‌డీ ఇవ్వాలన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు
25 November 2024, 5:33 IST
- BRS Harishrao: అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిహెచ్డీ ఇవ్వాలన్నారు బిజేపి నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అబద్దాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఏమేమి ఎగబెట్టారో అక్కడ ప్రజలకు గుర్తొచ్చిందన్నారు.
రేవంత్‌రెడ్డిపై హరీష్ రావు విమర్శలు
BRS Harishrao: తెలంగాణ మహారాష్ట్రకు మద్య వేయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, ఇక్కడ ప్రజలకు ఎగ్గొట్టన ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ తీరు బిజెపి వైఖరిపై మండిపడ్డారు. వందరోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేశారని ఆరోపించారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మీరు ఇచ్చిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం.. ఇక్కడ ఖూనీ అయిపోయిందని ఆరోపించారు.
దళిత బంధు వెంటనే ఇవ్వాలి...
హుజురాబాద్ లో 18500 మందికి దళిత బంధు కేసీఆర్ మంజూరు చేశారని హరీష్ రావు తెలిపారు. వారిలో కొందరికి ఆగిపోయిన ఐదు లక్షలు ఇవ్వమంటే వారిపై పోలీసులతో దాడి చేసి లాఠీ చార్జ్ చేయించారని ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి భట్టి దళితులకు చేసే మేలు ఇదేనా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే విడుదలైన దళిత బంధు డబ్బులను వాళ్లకు అందించాలని కోరారు. లగిచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మార్చాడని తెలిపారు. జులై 19, 2024 నాడు ఫార్మసిటీ అంటూ ఈ ప్రభుత్వమే గెజిట్ ఇచ్చింది...ఇప్పుడు నీవు ఇచ్చిన గెజిట్ పైనే అబద్ధాలు ఆడుతున్నావా అని ప్రశ్నించారు. ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ గెజిట్ వెనక్కి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు.దాన్ని రద్దుచేసి కొత్త గెజిట్ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని తెలిపారు
పచ్చని పంటలు పండే భూములను తొండలు గుడ్డు పెట్టని భూములుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న నీవు 20 టీఎంసీల నీటిని అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు ఎలా తీసుకెళ్తావు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 39 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. అందులో రెండు ఫిల్లర్లకు మాత్రమే డామేజ్ జరిగిందని తెలిపారు. గోరంతలు కొండంతలుగా గోబెల్ ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు పారే నీళ్లన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోసం చేశావు.... ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మోసం చేస్తావా? అన్నారు.
కాళేశ్వరం కూలిపోతే మూసికి నీళ్ల ఎలా పోతాయని ప్రశ్నించారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పై సాక్షాత్తు ప్రధానమంత్రి లోకసభలో మెచ్చుకున్నారని తెలిపారు. మిషన్ భగీరథ గతంలో ఫెయిల్ అయిందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే మిషన్ భగీరథ ఇంజనీర్లతో మీటింగ్ పెట్టి మాట్లాడాడని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు లాగానే హైదరాబాద్ కు 20 tmc నీళ్లు తరలించాలని మాట్లాడుతున్నాడని తెలిపారు.
ధాన్యం ఘనత తమదే....
మహాలక్ష్మి బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. హుజురాబాద్ లో దళిత సోదరులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేసి దళిత బంధు అకౌంట్ ల ఫ్రీజింగ్ ఎత్తివేసి వారికి డబ్బులు విడుదల చేయాలని కోరారు. డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీలో దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.