తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party:కొడంగల్ అడ్డాలో బీఆర్ఎస్ కు షాక్! ఆ కీలక నేత పార్టీ మారటం ఖాయమేనా?

BRS Party:కొడంగల్ అడ్డాలో బీఆర్ఎస్ కు షాక్! ఆ కీలక నేత పార్టీ మారటం ఖాయమేనా?

HT Telugu Desk HT Telugu

27 January 2023, 15:03 IST

google News
    • బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో కొడంగల్ అడ్డాలో బీఆర్ఎస్ షాక్ తగలటం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి
గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి (facebook)

గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి

brs leader ex mla gurunath reddy: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ పరిణామం కొడంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న గురునాథ్ రెడ్డిని రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. గురునాథ్ రెడ్డితో పాటు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ ను వీడి.. హస్తం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా అధికార బీఆర్ఎస్ కు షాక్ తలగటం ఖాయమనే చర్చ జోరుగా నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గురునాథ్ రెడ్డితో శుక్రవారం రేవంత్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గురునాథ్ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినప్పటికీ... బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే అనంతరం... స్థానిక ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్ల గురునాథ్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ కావటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన పార్టీ మారటం పక్కా అనే వాదన బలంగా వినిపిస్తోంది.

తదుపరి వ్యాసం