BJP Vijaya sankalpa Yatra: ఛార్మినార్ భాగ్య లక్ష్మీ ఆలయం నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం
19 February 2024, 11:10 IST
- BJP Vijaya sankalpa Yatra: ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలతో బీజేపీ విజయ సంకల్ప రథయాత్రలు ప్రారంభం అయ్యాయి. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు ప్రచార రథలకు పూజలు నిర్వహించారు.
ఛార్‌మినార్ నుంచి ప్రచారానికి బయల్దేరిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర వాహనాలు
BJP Vijaya sankalpa Yatra: ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లింలలో మెజార్టీ ప్రజలు మోదీలో సోదరుడిని చూస్తున్నారని, ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం కూడా బీజేపీ దక్కించుకుంటుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మోదీ నిర్ణయాలను అభ్యుదయ భావాలు ఉన్న ముస్లింలు, ముస్లిం మాతృమూర్తులు బీజేపీపై సానుకూల థృక్పథంతో ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలను విజయవంతంగా చేయాలని కోరారు. రోడ్ షోల ద్వారా ప్రజల మధ్యకు వెళ్తామని, బహిరంగ సభలను నిర్వహించమని స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఛార్మినార్ భాగ్య లక్ష్మీ ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప Vijaya sankalpa రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.
ఫిబ్రవరి 20 నుంచి తెలంగాణలో నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్ర Ratha Yatraల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు.
చార్మినార్ CharMinar భాగ్యలక్ష్మి Bhagyalakshmi దేవాలయం వద్ద విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలకు పూజా కార్యక్రమంలో కిషన్ రెడ్డి Kishanreddy పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్‌తోపాటు ముఖ్యనేతలు ఈటల రాజేందర్, డీకే.అరుణ, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత నాలుగు యాత్రలు ప్రారంభం కానుండగా ఐదో రథయాత్ర మాత్రం ఈ నెల 25న మొదలవుతుంది.
హైదరాబాద్‌ను మినహా 16 ఎంపీ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు క్లస్టర్లకు చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. కిషన్‌రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయపార్టీ ముఖ్యనేతలు యాత్రల్లో పాల్గొంటారని వివరించారు. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రను చేపట్టినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఐదు యాత్రలు ఇలా...
భాగ్యలక్ష్మి క్లస్టర్:
ఈ నెల 20న భువనగిరిలో ప్రారంభమై, 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్‌లో ముగిస్తుంది.
కొమురం భీం క్లస్టర్:
ఈ నెల 20వ తేదీనే ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్‌లో ప్రారంభవుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరవుతున్నారు. అదే రోజు బహిరంగసభ కూడా ఉంటుంది. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది
రాజరాజేశ్వరి క్లస్టర్:
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 20న ప్రారంభమయ్యే యాత్ర ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఈ యాత్ర 4 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కరీంనగర్‌లో ముగుస్తుంది.
కృష్ణమ్మ క్లస్టర్ :
నారాయణపేట జిల్లా మక్తల్‌లో 20వ తేదీనే ఈ యాత్ర మొదలై 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది
కాకతీయ-భద్రకాళి యాత్ర :
ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని సీట్లలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ములుగులో ముగుస్తుంది.