Telangana: బీఈ భారీ పెట్టుబడి - రూ.1800 కోట్లతో విస్తరణ ప్రణాళిక
22 July 2022, 14:56 IST
- biological e investments: ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్ - ఈ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలాలీ మరో రూ. 1800 కోట్ల పెట్టుబడితో కొత్తగా 3 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
బీఈ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
biological e investments in telangana: తెలంగాణలో టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగం భారీ విస్తరణకు బీఈ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ... రూ. 1800 కోట్లు పెట్టుబడులను పెట్టనుంది. ఫలితంగా ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీ ఎత్తున పెంచనుంది. దీనిద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించనుంది. తాజా నిర్ణయంతో... కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ వెల్లడించింది.
ఈ మేరకు బీఈ సంస్థ ప్రతినిధులు గురువారం ఐటీ మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. పెట్టుబడులతో పాటు విస్తరణ అంశంపై చర్చించారు. ' ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఏడాదీ 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే.. బీఈ తాజా విస్తరణతో 1,400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది. కొవిడ్ నివారణ టీకా జెన్సెన్, ఎమ్మార్ పీసీవీ , టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు, టెటనస్ టాక్సైడ్ యాంపూల్స్, జెనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నాం. తమ సంస్థకు మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు' అని బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల చెప్పారు.
కేటీఆర్ హర్షం...
తెలంగాలో బీఈ రూ. 1800 కోట్లతో భారీ పెట్టుబడి పెట్టడాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఫలితంగా ఏడాదికి 14 బిలియన్ డోస్ ల వ్యాక్సిన్లను ఉత్తత్తి చేసే ప్రాంతంగా హైదరాబాద్ మారిందని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుందని.. బీఈ విస్తరణతో మన బలాన్ని మరింత పెంచిందని ట్వీట్ లో రాసుకొచ్చారు.
బయోలిజికల్ -ఈ దక్షిణ భారతదేశంలోనే మొదటి ఔషధ తయారీ సంస్థ. దేశంలో బయోలిజికల్ ఉత్పత్తులను తయారు చేసిన ప్రైవేట్ సంస్థ కూడా ఇదే. ప్రస్తుతం 4 వ్యాపార విభాగాలు ఉన్న బీఈకీ తెలంగాణలో 6 తయారీ కేంద్రాలు ఉన్నాయి.