తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rbi On March 31: ఆదివారమైనా ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయి… మార్చి 31పై ఆర్‌బిఐ కీలక ఆదేశాలు

RBI on March 31: ఆదివారమైనా ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయి… మార్చి 31పై ఆర్‌బిఐ కీలక ఆదేశాలు

Sarath chandra.B HT Telugu

21 March 2024, 6:25 IST

google News
    • RBI on March 31: మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ఆర్‌బిఐ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 
మార్చి 31న యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు
మార్చి 31న యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు (REUTERS)

మార్చి 31న యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు

RBI on March 31: ఈ ఏడాది మార్చి 31 ఆదివారం Sunday కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు బుధవారం రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 ఆదివారం ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా సేవలు అందిస్తాయని ఆర్‌బిఐ ప్రకటించింది.

ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం రావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు Transactions నిర్వహించే బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయాలని ఆర్‌బిఐ సూచించింది.

సాధారణంగా మార్చి 31న ఫైనాన్షియల్ Financial Year ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తాయి. బ్యాంకు దస్త్రాల ఆడిటింగ్‌ కోసం ఏప్రిల్ 1న లావాదేవీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 31 ఆదివారం రావడంతో ఆ రోజు పనిచేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది.

ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలను, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగా కొనసాగించాలని, 2023-34 ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా లావాదేవీలు జరపాలని సూచించింది. ఆర్‌బిఐ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి.

ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఆర్‌బిఐ పరిధిలో లావాదేవీలు నిర్వహించే షెడ్యూల్డ్‌ బ్యాంకులు Scheduled Banks తమ శాఖలు పనివేళల్లో లావాదేవీలను యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ సూచించింది.

బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం మార్చి 31న ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని శాఖలను తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

బ్యాంకు సెలవులు….

ప్రతి నెలా అన్ని ఆదివారాలు, 2, 4 శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరం లావాదేవీలన్నీ సక్రమంగా నమోదు అయ్యేలా చూడటానికి మార్చి 31 (ఆదివారం) న ప్రభుత్వ రశీదులు మరియు చెల్లింపులను నిర్వహించే అన్ని బ్యాంకుల శాఖలు లావాదేవీల కోసం తెరిచి ఉండాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని రిజర్వ్‌ బ్యాంకు తెలిపింది.

ఏజెన్సీ బ్యాంకులు అంటే….

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలను తన సొంత కార్యాలయాలు మరియు ఏజెన్సీ బ్యాంకుల ద్వారా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆర్‌బిఐ పరిధిలోని ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు ఇవే….

ఏజెన్సీ బ్యాంకుల జాబితా

షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (విలీనం తర్వాత):

1. బ్యాంక్ ఆఫ్ బరోడా

2. బ్యాంక్ ఆఫ్ ఇండియా

3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

4. కెనరా బ్యాంక్

5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

6. ఇండియన్ బ్యాంక్

7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

9. పంజాబ్ నేషనల్ బ్యాంక్

10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

11. యూకో బ్యాంక్

12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

షెడ్యూల్డ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు:

13. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్

14. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్

15. డీసీబీ బ్యాంక్ లిమిటెడ్

16. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్

17. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్

18. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్

19. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్

20. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్

21. ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్

22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ (లిమిటెడ్ ఏజెన్సీ బిజినెస్ కోసం ఆమోదించబడింది)

23. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్

24. కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్

25. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్

26. ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్

27. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్

28. యస్ బ్యాంక్ లిమిటెడ్

29. ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్

30. బంధన్ బ్యాంక్ లిమిటెడ్

31. సీఎస్బీ బ్యాంక్ లిమిటెడ్

32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్

విదేశీ బ్యాంకులు:sa

33. డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారాన్ని పూర్తి అనుబంధ విధానంలో నిర్వహించడానికి ఆర్బిఐ ద్వారా లైసెన్స్ జారీ చేయబడిన షెడ్యూల్డ్ విదేశీ బ్యాంకు).

తదుపరి వ్యాసం