తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukulam Admissions : గురుకుల అడ్మిషన్స్ అప్డేట్స్ - దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే లాస్ట్ ఛాన్స్..!

TS Gurukulam Admissions : గురుకుల అడ్మిషన్స్ అప్డేట్స్ - దరఖాస్తు గడువు పొడిగింపు, ఇదే లాస్ట్ ఛాన్స్..!

21 January 2024, 7:17 IST

google News
    • Telangana Gurukula School Admission 2024 : 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది.
గరుకుల ప్రవేశాలు
గరుకుల ప్రవేశాలు (https://www.tswreis.ac.in/)

గరుకుల ప్రవేశాలు

Telangana Gurukulam Admissions Updates: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వేర్వేరు సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్ నోటిఫికేష్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఎస్సీ,ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 18వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. అయితే ఈ గడువు పూర్తి అయిన నేపథ్యంలో… అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సంక్షేమ పాఠశాలల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం 2024 ఫిబ్రవరి 11వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థతో పాటు, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://tswreis.ac.in లో చూడవచ్చు. దీంతో పాటు http://tgcet.cgg.gov.in లో నోటిఫికేషన్ వివరాలు లభిస్తాయి. వంద రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్ధికి బదులు ఇతరుల ఫోటోలతో దరఖాస్తు చేసే వారిపై ఐపీసీ 416 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని అధికారులు హెచ్చరించారు. విద్యార్ధుల ఎంపికకు ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. సందేహాల నివృత్తి కోసం 180042545678 నంబరును సంప్రదించవచ్చు. అయా జిల్లాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా వివరాలు లభిస్తాయ.2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదవుతున్న విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోడానికి అర్హులని ప్రకటించారు. విద్యార్ధినీ విద్యార్ధులు 4వ తరగతి చదువుతున్నట్లు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చీఫ్ కన్వీనర్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ నవీస్‌ నికోలస్ తెలిపారు.

ప్రవేశ పరీక్షను 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్‌ షీట్‌‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.

తదుపరి వ్యాసం