తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Election 2024 : జహీరాబాద్ టికెట్ పై నేతల కన్ను..! రేసులో బాగారెడ్డి, అలె నరేంద్ర కుమారుడు

Lok Sabha Election 2024 : జహీరాబాద్ టికెట్ పై నేతల కన్ను..! రేసులో బాగారెడ్డి, అలె నరేంద్ర కుమారుడు

HT Telugu Desk HT Telugu

27 March 2024, 11:26 IST

google News
    • Lok Sabha Election 2024: జహీరాబాద్ సీటును దక్కించుకోవాలని చూస్తున్నారు పలువురు బీజేపీ నేతలు. ఇందుకోసం పావులు కదుపుతున్నారు. ఈసారి ఎలాగైనా జహీరాబాద్ గడ్డపై కాషాయజెండాను ఎగరవేస్తామని ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. 
లోక్ సభ ఎన్నికలు - 2024
లోక్ సభ ఎన్నికలు - 2024

లోక్ సభ ఎన్నికలు - 2024

Lok Sabha Election 2024 : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, జహీరాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీటు ఆశిస్తూ పలువురు నాయకులూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. జిలాలోని మెదక్ లోక్ సభ స్థానం నుండి రికార్డు స్థాయిలో ఏడూ సార్లు ఎంపీగా గెలిచిన…, మొగలిగుండ్ల బాగా రెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, మెదక్ ఎంపీగా గెలిసిన మరొక నేత అలె నరేంద్ర కుమారుడు అలె భాస్కర్, 2019 ఎన్నికల్లో బీజేపీకి టికెట్ పైన పోటీచేసి ఓడిపోయిన బాణాల లక్ష్మా రెడ్డి, బీజేపీ పార్టీ నుండి బోధన్ ఎమ్మెల్యే సీటు కోసం విఫలయత్నం చేసిన పారిశ్రామికవేత్త మేడపాటి ప్రకాష్ రెడ్డి సీటు కోసం పోటీపడుతున్నవారిలో ఉన్నారు. జహీరాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండగ, మిగతా నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలు ఉన్నాయి.

కామారెడ్డిలో గెలుపు....

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ, జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా… కామారెడ్డి స్థానాన్ని బీజేపీ పార్టీ, మిగతా నాలుగు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలిసింది. కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ప్రస్తుత ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిలను ఇద్దరినీ ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గెలవడంతో… కాషాయ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా మంచి జోష్ లో కనిపిస్తుంది. జహీరాబాద్ లోక్ సభ స్థానం.. కర్ణాటక, మహారాష్ట్ర కు బోర్డర్ లో ఉండటం కూడా కొంతమేరకు బీజేపీకి కలిసి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎలాగైనా గెలవాలని వ్యూహం...

గత 2019 లోక్ సభ ఎన్నికల్లో, బీఆర్ఎస్ అభ్యర్థి బిబి పాటిల్ కేవలం 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంతో, బీజేపీ పార్టీ నాయకత్వం కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పార్టీ జాతీయ కార్యదర్శి ఈ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులతో పలుమార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి, వారికీ దిశానిర్ధేశం చేశారు. చివరిసారి ఎన్నికల్లో పోటీచేసిన, బాణాల లక్ష్మా రెడ్డి 1 లక్ష 38 వేల ఓట్లు తెచుకోగా… జహీరాబాద్ లో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అందుకే స్థానికంగా, బలంగా ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ బాగా రెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి కోరుతున్నాడు. బిసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న తనకు తనకు తండ్రి నరేంద్ర ఇమేజ్, బిసిల ఓటు బ్యాంక్ కలిసొస్తుందని అలె భాస్కర్ భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం మాత్రం, ఇప్పటికిప్పుడే ఎవ్వరికి హామీ ఇవ్వకుండా అందరు పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసి ఎవరికీ టికెట్ ఇచ్చిన గెలిపించుకోవాలని పిలుపునిస్తోంది.

రిపోర్టింగ్: మెదక్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం