తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Crime : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం, ఒకే రోజు భార్యాభర్తలు ఆత్మహత్య!

Adilabad Crime : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం, ఒకే రోజు భార్యాభర్తలు ఆత్మహత్య!

27 January 2024, 17:09 IST

google News
    • Adilabad Crime : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.
విజయ్, పల్లవి(పాత ఫొటోలు)
విజయ్, పల్లవి(పాత ఫొటోలు)

విజయ్, పల్లవి(పాత ఫొటోలు)

Adilabad Crime : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన విజయ్ కు మహారాష్ట్రకు చెందిన పల్లవితో గతేడాది వివాహం జరిగింది. ఇటీవల సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి శుక్రవారం తిరిగి వచ్చింది. వ్యవసాయ పనులకు వెళ్లిన భర్త, ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి పల్లవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భార్య మృతిని జీర్ణించుకోలేక అదే రోజు భర్త విజయ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్య మృతిని తట్టుకోలేక

ఆదిలాబాద్ పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో విజయ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే విజయ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. భార్యాభర్తలు ఒకే రోజు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి‌. ఇరువురి మరణాలకు కుటుంబ కలహాలు కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్కా,తమ్ముడు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నరసింహ గౌడ్ ,సోమేష్ గౌడ్ అన్నదమ్ములు. 12 ఏళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ లోని హైదర్గూడా కేశవ్ నగర్ లోని స్వంత ఇల్లు కట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. భవనం పై అంతస్తులో నరసింహ, స్వప్న దంపతులు, తమ ఇద్దరు కుమారులతో పాటు నరసింహ మేనమామ కుమారుడు స్వప్న సోదరుడైన శేఖర్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. కింది అంతస్తులో సోమేశ్ అతని భార్య స్రవంతి (28) ఇద్దరి కుమారులతో కలిసి ఉంటున్నారు. నరసింహ, సోమేశ్ అన్నదమ్ములు ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తుండగా మృతుడు శేఖర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం స్వగ్రామంలో బంధువు దశ దినకర్మ ఉండడంతో నరసింహ, సోమేశ్ తో పాటు స్వప్న వెళ్లారు. ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వెళ్లి వచ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి చెందు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. గది లోపలకి వెళ్లి చూడగా తల్లి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. భయంతో పిల్లలు వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో విషయం చెప్పారు. వారు భర్త సోమేశ్ తో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా హాల్లో స్రవంతి, బెడ్రూంలో శేఖర్ ఉరేసుకొని విగత జీవులుగా కనిపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏ కారణంతో స్రవంతి, శేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారో తమకు తెలియడం లేదని, తామంతా కలిసిమెలిసి ఉండే వారిమని బంధువులు చెబుతున్నారు. శేఖర్ గత ఐదేళ్లుగా తమ ఇంట్లోనే ఉంటున్నాడని వరుసకు తమకు మేనమామ కుమారుడు అవుతాడని నరసింహ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమేష్‌ దంపతులు పదేళ్ల క్రితమే వారు అత్తాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. ఐదేళ్ల క్రితం గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్‌ ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా కింది అంతస్తులో సోమేష్‌ కుటుంబం నివసిస్తోంది. సోమేష్‌ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా స్రవంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

తదుపరి వ్యాసం