తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb On Ccs Acp: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు

ACB on CCS ACP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు

Sarath chandra.B HT Telugu

21 May 2024, 13:36 IST

google News
    • ACB on CCS ACP: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది.
హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు

ACB on CCS ACP: ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగాలతో హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు నివాసంలో తెలంగాణ ఏసీబీ సోదాలు చేపట్టింది.

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అశోక్‌నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.

సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లోని 6 చోట్ల సోదాలు జరుగుతుండగా మరో 4 ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.

ఏసీపీ ఉమామహేశ్వరరావు బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు చేసింది. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ కేసుల్లో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు.

ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ మర్డర్‌ కేసులో ఉమామహేశ్వరరావును పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. గతంలో అవినీతి ఆరోపణలతో పలుమార్లు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదని చెబుతున్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నంలలో ఉమామహేశ్వరరావు నివాసాల్లో కూడా ఏసీబీ సోదాలు జరుపుతోంది.

జవహర్‌నగర్‌లో విధులు నిర్వర్తించిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఏసీపీ ఉమామహేశ్వరరావు ఒకసారి సస్పెండ్ అయ్యారు. సర్వీసులో ఇప్పటి వరకు మూడు సార్లు ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే మరోసారి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం