తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Raids : నిర్మల్ జిల్లాలో సోదాలు - ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

ACB Raids : నిర్మల్ జిల్లాలో సోదాలు - ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

HT Telugu Desk HT Telugu

05 November 2023, 6:46 IST

google News
    • ACB Raids in Nirmal : నిర్మల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం డిమాండ్ చేసి ఇద్దరు ఉద్యోగులు పట్టుబడ్డారు.
ఏసీబీ సోదాలు
ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

ACB Raids in Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం డిమాండ్ చేసి ఇద్దరు ఉద్యోగులు పట్టబడ్డారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ మరియు ఆక్కడే పనిచేస్తున్న ప్రయివేట్ అసిస్టెంట్ రాజేందర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నర్సాపూర్ (జి ) మండలం చాకపల్లి గ్రామానికి చెందిన కలీం అనే వ్యక్తి తన ఇంటిని గిఫ్ట్ డిడ్ రిజిస్ట్రేషన్ కోసం గత నెల 31న కార్యాలయానికి వెళ్లాడు. జూనియర్ అసిస్టెంట్ అరుణ్ ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్లు 8వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. చిన్నపాటి విషయంకి లంచం అడుగుతున్నారని కలీం ఏసీబీని సంప్రదించారు. జూనియర్ అసిస్టెంట్ చేసిన డిమాండ్ ప్రకారంగా శనివారం లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు. నిందితుని అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కార్యాలయంలో పని చేస్తున్న కొందరు శనివారం సెలవుల్లో వెళ్లడం గమనార్హం, ఏసీబీ అధికారులు దాడి విషయం ముందే తెలియడం తో సెలవుల్లో వెళ్లినట్లు కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఏసీబీ అధికారులకు చాలా ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో జిల్లాలు అనేక చోట్ల దాడులు చేసి అధికారులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్

తదుపరి వ్యాసం