Indira Shoban | ఆప్ ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం
15 May 2022, 18:50 IST
- తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుల సమస్యలపైన పోరాడుతామని ఆప్ నేత ఇందిరా శోభన్ అన్నారు. సామాన్యుల నాయకత్వంలో పార్టీని అధికారంలో తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.
ఇందిరా శోభన్
ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి తగిన గౌరం కల్పిస్తామని ఇందిరా శోభన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించేందుకు ఇందిరా శోభన్ ఢిల్లీ వెళ్లారు. ఆప్ తెలంగాణ ఎలక్షన్ ఇన్ఛార్జి సోమనాథ్ తో సమావేశం అయ్యారు. ఇరువురు నేతలు చర్చించి టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపై చర్చించారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు.. రాష్ట్రంలో ఆప్ ప్రతినిధులను నియమించారు
ఆప్ తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఎడగొట్టు లక్ష్మీనారాయణ , భేతపుదయ్ యేహోషువ (జాషువా), చంద్రశేఖర్, గోర్ శ్యాంసుందర్ ను నియమించారు. అలాగే ఆప్ తెలంగాణ రాష్ట్ర ప్రజా సంబంధాల అధికారిగా సయ్యద్ గఫార్ ను నియమించారు,
తెలంగాణ రాష్ట్రంలో ఆప్ ను వ్యవస్థాగతంగా బలోపేతం చేయడం కోసం అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని ఇందిరా శోభన్ చెప్పారు. రాబోయే కాలంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళిక వేస్తామని చెప్పారు.
టాపిక్