తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఎక్స్ లవర్ అనుకుని ఆ ఫొటోలను పంపింది.. ఆ రోజు అతడిని చూడగానే….

ఎక్స్ లవర్ అనుకుని ఆ ఫొటోలను పంపింది.. ఆ రోజు అతడిని చూడగానే….

HT Telugu Desk HT Telugu

03 June 2022, 17:25 IST

google News
    • హైదరాబాద్ నగరానికి యువతి దారుణంగా మోసపోయింది. ఫోన్ చేసింది మాజీ ప్రియుడే అనుకుని ప్రతిరోజు మాట్లాడం మెుదలుపెట్టింది. ఒకరోజు యువకుడి కోరిక మేరకు ఏకంగా తన పర్సనల్ ఫొటోలను కూడా షేర్ చేసింది. తీరా అసలు మేటర్ తెలిసి షాక్ కు గురైంది ఆ యువతి.
మాజీ ప్రియుడు అనుకుని మోసపోయిన యువతి
మాజీ ప్రియుడు అనుకుని మోసపోయిన యువతి

మాజీ ప్రియుడు అనుకుని మోసపోయిన యువతి

ఆమె ఓ యువకుడిని ప్రేమించింది.. కొంతకాలం పాటు బాగానే ఉన్నారు. తర్వాత విడిపోయారు. సీన్ కట్ చేస్తే యువతికి ఓ రోజు ఫోన్ కాల్ వచ్చింది... నేనూ నీ ఎక్స్ లవర్ అంటూ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతే ఆ యువతి తెగ ఆనందపడిపోయింది.. మళ్లీ తాము కలిశామని ముచ్చటపడింది..! ఆ రోజు నుంచి ఫోన్ లో గంటలతరబడి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ చేసిన యువకుడు... పర్సనల్ ఫొటోలు పంపమని అడిగాడు..! అడిగింది ప్రియుడే కదా ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే టకటక షేర్ చేసేసింది సదరు యువతి..!తీరా మేటర్ తెలిసి..పోలీసులను ఆశ్రయించింది.

ఏం జరిగిందంటే....

హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లికి చెందిన మహమ్మద్‌ మొహ్సిన్‌(22) పెయింటర్‌. ఇతను ఓ మహిళకు ఫోన్‌ చేశాడు. రాజుగా పరిచయం చేసుకున్నాడు. సదరు యువతి అతడిని తన మాజీ ప్రియుడిగా నమ్మేసింది. అతనూ కూడా అలాగే నటించాడు. మాట్లాడుకోవటం పెరిగిపోయింది. అతని కోరిక మేరకు అర్ధనగ్న చిత్రాలు పంపించింది.

ఓ రోజు ఇద్దరూ మీట్ కాగా.. ఆ యువకుడు వచ్చిన యువకుడు మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ కాదని తెలిసి షాక్ అయింది. కంగారుపడిన యువతి అర్ధనగ్నచిత్రాలు ఫోన్‌ నుంచి తొలగించమని అతన్ని కోరింది. అతను డబ్బులివ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేయటం స్టార్ట్ చేశాడు. వాటిని వైరల్‌ చేస్తానని బెదిరించాడు.

బాధితురాలు హైదరాబాద్ షీ టీం పోలీసులను ఆశ్రయిచంగా నిందితుడు మొహ్సిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరా అంగీకరించాడు. నిందితుడిని మలక్ పేట్ పోలీసుకు అప్పగించారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం