తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Police Viral Video : తెలంగాణ పోలీసులు చాలా స్మార్ట్‌ గురూ!- ఈ 'కటౌట్'ల కథ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

TG Police Viral Video : తెలంగాణ పోలీసులు చాలా స్మార్ట్‌ గురూ!- ఈ 'కటౌట్'ల కథ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

28 June 2024, 14:18 IST

google News
    • Telangana Police Cardboard Cutouts : తెలంగాణ పోలీసుల వినూత్న ప్రయోగానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు….'తెలంగాణ పోలీసులు చాలా స్మార్ట్ గురూ' అంటూ  రకరకాలుగా రాసుకొస్తున్నారు.
తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన కటౌట్‌
తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన కటౌట్‌ (X/@AbhishekSay)

తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన కటౌట్‌

దేశంలో అత్యంత పటిష్టమైన పోలీసు వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్ర ఏర్పడిన పదేళ్ల కాలంలోనే అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఓవైపు శాంతి భద్రతలను కాపాడుకుంటూనే… మరోవైపు ఎంత పెద్ద నేరాలైనా సరే తమదైన శైలిలో విచారణ చేస్తూ చేధిస్తున్నారు. అంతర్జాతీయంగానూ తెలంగాణ పోలీసింగ్ కు మంచి పేరు ఉంది. 

గత కొద్దిరోజులుగా రోడ్డు ప్రమాదాలపై  తెలంగాణ పోలీసులు లోతుగా దృష్టిసారిస్తున్నారు. కేవలం ప్రధాన రోడ్లపైనే కాదు… చిన్నచిన్న రోడ్లపై కూడా తనిఖీలు చేస్తూ ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఫైన్లు మాత్రమే కాదు… జైలు శిక్షలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు. వీటిపై సోషల్ మీడియాలోనూ తెగ ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు చేసిన ఓ వినూత్న ప్రయోగం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంద్ది. నెటిజన్లు కూడా తెగ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోలో ఏం ఉందంటే… ' ఓ డ్రైవర్ హెల్మెంట్(ద్విచక్రవాహనం) ధరించకుండానే మెయిన్ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ వెెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డుపై ఓ పోలీస్ కనిపించాడు. దాని పక్కనే పోలీసింగ్ వాహనం కూడా ఉంది. అది గమనించిన వెంటనే…. తన వద్ద ఉన్న హెల్మెంట్ ను పెట్టుసుకున్నాడు. అయితే దగ్గరగా వెెళ్లిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ తో పాటు వాహనాన్ని చూసి షాక్ అయ్యాడు. అది నిజమైనది కాదని….   కార్డ్‌బోర్డ్ కటౌట్" అని గ్రహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

డెక్కన్ క్రానికల్ పేపర్ లో ప్రచురితమైన కథనం ప్రకారం… కరీంనగర్ నుండి వేములవాడ జాతీయ రహదారిపై ఈ తరహా కటౌలు ఉన్నాయి. వీటిని కరీంనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించటమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నిబంధనలను పాటించేలా చేస్తుందన్న కోణంలోనే ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

ఈ వీడియోపై స్పందించిన ఓ నెటిజన్… ‘దేవుడా దయచేసి ముంబైలోని ప్రతి ఒక్క మార్గంలో వీటిని ఇన్‌స్టాల్ చేయండి’ అంటూ 'X ' ఖాతాలో రాసుకొచ్చాడు. ఇలా ఒక్కరు కాదు అనేక మంది నెటిజన్లు… తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. తెలంగాణ పోలీసులు చాలా స్మార్ట్ గురూ అంటూ ప్రశంసిస్తున్నారు.

తదుపరి వ్యాసం