తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Police Case On Cbn: అనుమతి లేని ర్యాలీపై చంద్రబాబుపై పోలీస్ కేసు నమోదు

Police Case On CBN: అనుమతి లేని ర్యాలీపై చంద్రబాబుపై పోలీస్ కేసు నమోదు

Sarath chandra.B HT Telugu

02 November 2023, 13:12 IST

google News
    • Police Case On CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం బేగంపేట నుంచి భారీ ర్యాలీ నిర్వహించినందుకు  చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. దు
బేగంపేటలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ర్యాలీ
బేగంపేటలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ర్యాలీ

బేగంపేటలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ర్యాలీ

Police Case On CBN: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భారీ ర్యాలీ నిర్వహించడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో బాబుపై కేసు నమోదైంది.

బుధవారం సాయంత్రం ఉండవల్లి నుంచి నుంచి హైదరాబాద్ వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును చూసేందుకు బేగంపేట విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వివిధ వర్గాల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును చూసేందుకు ఎయిర్ పోర్ట్ కువచ్చారు. కార్లో నుంచే అందరికీ చంద్రబాబు అభివాదం చేస్తూ చంద్రబాబు భారీ కాన్వాయ్‌తో నివాసాని వెళ్లారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

దీంతో చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. బుధవారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు ముందస్తు అనుమతి తీసుకోలేదన్నారు. బేగంపేట ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నెంబర్ 531/2023 కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 341, 290, 341, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ ల కింద కేసు నమోదైంది. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబుపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం