తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Us H1b Visa Renewal: భారతీయులకు అమెరికాలోనే హెచ్‌-1 బీ వీసాల రెన్యువల్…

US H1B Visa Renewal: భారతీయులకు అమెరికాలోనే హెచ్‌-1 బీ వీసాల రెన్యువల్…

Sarath chandra.B HT Telugu

31 January 2024, 11:30 IST

    • US H1B Visa Renewal: ప్రవాస భారతీయులకు ఇకపై అమెరికాలోనే వీసాలు పునరుద్దరించే పైలట్ ప్రాజెక్టును యూఎస్‌లో ప్రారంభించారు. భారతీయులతో పాటు కెనడా పౌరుల వీసాలు అమెరికాలోనే రెన్యువల్ చేస్తారు.
అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల పునరుద్ధరణ
అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల పునరుద్ధరణ

అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల పునరుద్ధరణ

US H1B Visa Renewal: అమెరికాలో హెచ్‌-1బీ వీసాల రెన్యువల్‌కు సంబంధించిన పైలట్‌ పథకన్నా సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదట 20వేల వీసాలను అమెరికాలోనే రెన్యువల్‌ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఈ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడా వాసులకే కల్పించారు. 5 వారాలపాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం 4వేల చొప్పున వీసాలను రెన్యువల్‌ చేస్తారు. 2020 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్‌ 1 మధ్య కెనడా పౌరులకు జారీ చేసిన వీసాలు, 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబరు 30 మధ్య భారతీయులకు జారీ చేసిన వీసాలను ఈ పథకంలో భాగంగా రెన్యువల్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు.

భారతీయులు ఎక్కువగా కోరుకునే H-1B విదేశీ ఉద్యోగాల వీసాలను పునరుద్ధరించడానికి అమెరికా ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. దీని వల్ల వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.

H-1B వీసా వలసేతర వీసాగా పరిగణిస్తారు. US కంపెనీలలో పనిచేయడానికి అవసరమైన సాంకేతిక నిపుణులతో పాటు ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ వీసా ద్వారా అనుమతి లభిస్తుంది. భారతదేశంతో పాటు చైనా వంటి దేశాల నుండి ఏటా దాదాపు పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాలపై ఆధారపడి ఉంటాయి.

జనవరి 29న ప్రారంభించిన వీసాల పునరుద్ధరణ కార్యక్రమం ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం H-1B వీసాలు ఉన్న వారు, స్వదేశాలకు వెళ్లడానికి ముందే USలో తమ వీసాలను పునరుద్ధరించుకోవడానికి ఈ ప్రాజెక్టు అనుమతిస్తుంది. గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా ఈ నిర్ణయం ప్రకటించింది.

పైలట్ ప్రోగ్రామ్‌లో జనవరి 29, 2024 నుండి ఏప్రిల్ 1, 2024 వరకు లేదా అన్ని అప్లికేషన్ స్లాట్‌లు నిండిన తర్వాత, ఏ దరఖాస్తు ముందుగా వస్తే వాటిని స్వీకరిస్తారు.

పరిమిత సంఖ్యలో H-1B వీసాలు కలిగిన భారతీయులు తమ వీసాలను US లోపల నుండి పునరుద్ధరించుకోవడం రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

భారతదేశంలోని US ఎంబసీలు మరియు కాన్సులేట్‌ల ద్వారా అప్లికేషన్ స్లాట్‌లు జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19 మరియు ఫిబ్రవరి 26న విడుదల చేస్తారు. దరఖాస్తుదారులు పైన పేర్కొన్న తేదీలలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం పరిమితికి లోబడి దరఖాస్తులు ప్రాసెస్ చేస్తారు.

“ఒక దరఖాస్తు తేదీలో దరఖాస్తు చేయలేని దరఖాస్తుదారులు నిర్ణీత గడువులోగా మిగిలిన దరఖాస్తు తేదీలో స్లాట్‌ కోసం మళ్లీ ప్రయత్నించవచ్చు. అన్ని అప్లికేషన్ స్లాట్‌లు నిండిన తర్వాత లేకుంటే ఏప్రిల్ 1, 202లోగా ఏది ముందుగా పూర్తైతే అప్పటితో దరఖాస్తుల గడువు ముగియనుంది.

దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ మరియు ఇతర అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేయడానికి ఆరు నుండి ఎనిమిది వారాలు పడుతుంది. మొదట వచ్చిన దరఖాస్తులు మొదట ప్రాతిపదికన క్లియర్ చేస్తారు.

"పైలట్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అవసరమైన అర్హతలు లేని వారు, పైలట్ ప్రోగ్రామ్‌లో పాల్గొనకూడదని భావించే వారు US ఎంబసీ లేదా విదేశాల్లోని కాన్సులేట్‌‌లలో వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

-----

తదుపరి వ్యాసం