తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Medical College: నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్న దామోదర రాజనరసింహ

Medak Medical College: నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్న దామోదర రాజనరసింహ

HT Telugu Desk HT Telugu

25 October 2024, 14:02 IST

google News
    • Medak Medical College: మెదక్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల కల సాకారమైంది. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరునికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెదక్‌ మెడికల్‌ కాలేజీ తరగతులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ
మెదక్‌ మెడికల్‌ కాలేజీ తరగతులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ

మెదక్‌ మెడికల్‌ కాలేజీ తరగతులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ

Medak Medical College: మెదక్ పట్టణంలోని పిల్లి కొట్యాల్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. త్వరలో రాష్ట్రంలో నూతనంగా 5 క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు . ప్రస్తుత కాలంలో డయాబెటిస్, క్యాన్సర్, బిపి, గుండె సంబంధిత వ్యాధులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. కావున వీటిపై గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్యాన్సర్ కోసం ప్రతి జిల్లాలో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

వచ్చే సంవత్సరం 220 పడకల ఆసుపత్రి.…

ప్రభుత్వ వైద్యం అందరికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 90శాతం టిట్మెంట్ స్థానిక ప్రాంతంలోనే జరగాలని, హైదరాబాద్ వంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యాక్సిడెంట్ ల దృశ్య మొదటి గంట ప్రధానం అనే ఉదేశ్యంతో 74 ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో, మండల స్థాయిలో వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకవచ్చే ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేవిధంగా జిల్లాలో 220 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

విద్యార్థులు వైద్య వృత్తికి న్యాయం చేయాలని....

వైద్య వృత్తి అంటేనే నిరంతరం నేర్చుకుంటూనే ముందుకు సాగుతారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. విద్యార్థులు వైద్య వృత్తికి న్యాయం చేయాలని,చదువుతూనే టెక్నాలజీతో పోటీపడాలన్నారు. వైద్య సేవలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవ చేయాలని యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు. తల్లితండ్రులకు, గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకరావాలని సూచించారు.

ఫ్రెండ్లీ డాక్టర్ గా ఉంటూ రోగులకు ఉత్తమ సేవలు అందించినప్పుడే వృత్తికి న్యాయం చేసిన వారు అవుతరాన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి తల్లిదండ్రులకు గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విద్యార్థుల సూచించారు.

దౌల్తాబాద్ లో రూ. 156 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం .....

రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో రూ. 156 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు రాజనర్సింహ, కొండా సురేఖ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ - సంగారెడ్డి రోడ్ లో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. అటువంటి సంఘటనలకు సత్వర వైద్యం అందించడానికి ఈ ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి దామోదర్ అన్నారు. దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు

తదుపరి వ్యాసం