తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Attack On Indian Student: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్ధిపై దాడి చేసి దోపిడీ.. వైరల్‌గా మారిన వీడియోలు

Attack On Indian Student: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్ధిపై దాడి చేసి దోపిడీ.. వైరల్‌గా మారిన వీడియోలు

Sarath chandra.B HT Telugu

07 February 2024, 7:06 IST

google News
    • Attack On Indian Student: అమెరికాలో భారతీయ మరో భారతీయ విద్యార్ధిపై  దాడి జరిగింది. భోజనం కోసం వెళ్లిన విద్యార్ధిపై నలుగురు దాడి చేసి ఫోన్‌, నగదు లాక్కున్నారు. 
చికాగోలో దుండగుల చేతిలో దాడికి గురైన సయ్యద్ మజాహిర్ అలీ
చికాగోలో దుండగుల చేతిలో దాడికి గురైన సయ్యద్ మజాహిర్ అలీ

చికాగోలో దుండగుల చేతిలో దాడికి గురైన సయ్యద్ మజాహిర్ అలీ

Attack On Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్ధిపై దాడి attack జరిగింది. వరుస దాడులతో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయుల్లో ఆందోళన నెలకొంది. తాజా ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ భారతీయ విద్యార్థిపై చికాగోలోని అతని ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగలు దాడి చేశారు.

మాటు వేసి వెంటాడి విద్యార్ధిపై దాడి చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో, బాధితుడు సయ్యద్ మజాహిర్ అలీ Mazahir Ali తన ఫోన్‌ను కూడా లాక్కొన్నారని, దొంగలు తనపై దాడి చేశారని వివరిస్తూ రక్తస్రావంతో కనిపించాడు.

ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు శవమై కనిపించిన నేపథ్యంలో ఇటీవలి దాడి జరిగింది. గత కొద్ది వారాల్లోనే భారతీయ విద్యార్ధులకు సంబంధించిన పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అనుమానాస్పద మరణాలు, దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ Mazahir Ali తాను ఉంటున్న ఇంటి సమీపంలో ముగ్గురు దాడి వెంబడిస్తున్నట్లు CCTV ఫుటేజీలో కనిపించింది.

మరో వీడియోలో బాధితుడి నుదిటి మీద, ముక్కు, నోటిలో రక్తం కారుతుండగా తనను కాపాడాలని వేడుకోవడం కనిపించింది. “నలుగురు వ్యక్తులు నాపై దాడి చేశారు. నా చేతిలో ఫుడ్ ప్యాకెట్‌తో ఇంటికి తిరిగి వస్తున్నాను. నేను మా ఇంటి దగ్గరలో వారి చేతికి చిక్కానని నలుగురు కలిసి తనను చితకబాదారని, తనకు సహాయం చేయాలని వేడుకున్నారు.

హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో నివసిస్తున్న సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లారు.

గత నెలలో, జార్జియా రాష్ట్రంలోని ఒక స్టోర్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్న భారతీయ విద్యార్థి వివేక్ సైనీ హత్యకు గురయ్యాడు, నిరాశ్రయుడైన వ్యక్తికి ఆశ్రయం కల్పించిన సైనీ చివరకు అతని చేతిలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు.

తాజా ఘటనలో దాడికి గురైన భారతీయ విద్యార్ధితో భారత కాన్సులేట్ సంప్రదించింది. భారతదేశంలోని అతని భార్యకు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన అలీకి మరియు అతని కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని భారత హై కమిషన్ హామీ ఇచ్చింది.

"కాన్సులేట్ వర్గాలు భారతదేశంలోని సయ్యద్ మజాహిర్ అలీ మరియు అతని భార్య సయ్యదా రుక్వియా ఫాతిమా రజ్వీతో సంప్రదింపులు జరుపుతోందని సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి హామీ ఇస్తున్నాం" అని చికాగోలోని భారత కాన్సులేట్ X లో ఒక పోస్ట్‌లో రాసింది.

భారత కాన్సులేట్ "కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక అధికారులను కూడా సంప్రదించింది." అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మరొక వీడియోలో చికాగో వీధుల్లో అలీని ముగ్గురు దాడి చేసిన వ్యక్తులు వెంబడించారు. అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థులపై దాడులు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గత వారం, అమెరికాలోని శ్రేయాస్ రెడ్డి అనే భారతీయ విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో శవమై కనిపించాడు. అయితే అతని మరణానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. రెడ్డి లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థిగా ఉన్నాడు.

హైదరాబాద్‌ యువకుడిపై దాడి ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. జనవరి 30న, పర్డ్యూ యూనివర్శిటీలో నీల్ ఆచార్య అనే విద్యార్థి రోజుల తరబడి తప్పిపోయిన తర్వాత చనిపోయాడని టిప్పెకానో కౌంటీ కరోనర్ తెలిపారు.

జనవరి 29న, అమెరికాలోని జార్జియాలోని లిథోనియాలోని ఓ దుకాణంలో నిరాశ్రయులైన వ్యక్తి సుత్తితో పదే పదే కొట్టడంతో వివేక్ సైనీ అనే మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.

ఆరేళ్లలో 403 మరణాలు…

సహజ కారణాలు, ప్రమాదాలతో పాటు వివిధ కారణాల వల్ల విదేశాలలో 2018 నుండి మొత్తం 403 భారతీయ విద్యార్థులు మరణించారు. ఇలాంటి వాటిలో కెనడాలో 91 కేసులతో అగ్రస్థానంలో ఉందని, UKలో 48 తర్వాతి స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం లోక్‌సభకు తెలియజేసింది.

"విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సహజ కారణాలు, ప్రమాదాలు మరియు అనారోగ్య పరిస్థితులతో సహా వివిధ కారణాల వల్ల విదేశాలలో భారతీయ విద్యార్థులు మరణించిన 403 సంఘటనలు 2018 నుండి నమోదయ్యాయి" అని విదేశాంగ మంత్రి చెప్పారు.

కెనడాలో 91 మంది, బ్రిటన్‌లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఆస్ట్రేలియాలో 35 మంది, ఉక్రెయిన్‌లో 21 మంది, జర్మనీలో 20 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు ఈ డేటా వెల్లడించింది.

గణాంకాల ప్రకారం, సైప్రస్‌లో 14 మంది భారతీయ విద్యార్థులు, ఫిలిప్పీన్స్ మరియు ఇటలీలో ఒక్కొక్కరు 10 మంది మరియు ఖతార్, చైనా మరియు కిర్గిజ్‌స్థాన్‌లలో ఒక్కొక్కరు తొమ్మిది మంది మరణించారు.

తదుపరి వ్యాసం