తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Kite Accidents: ప్రాణం తీసిన పతంగులు.. హైదరాబాద్‌లో బాలుడు మృతి

Hyderabad Kite Accidents: ప్రాణం తీసిన పతంగులు.. హైదరాబాద్‌లో బాలుడు మృతి

HT Telugu Desk HT Telugu

17 January 2024, 12:44 IST

    • Hyderabad Kite Accidents: హైదరాబాద్ లో గాలి పటం మరో బాలుడి ప్రాణం తీసింది. కరెంటు తీగలపై పడిన గాలిపటం తీస్తుండగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 
కాటేదాన్‌లో ప్రాణాలు కోల్పోయిన బాలుడు
కాటేదాన్‌లో ప్రాణాలు కోల్పోయిన బాలుడు

కాటేదాన్‌లో ప్రాణాలు కోల్పోయిన బాలుడు

Hyderabad Kite Accidents: హైదరాబాద్‌లో గాలి పటం మరో బాలుడి ప్రాణం తీసింది. 11 ఏళ్ళ బాలుడు గాలి పటం ఎగర వేస్తుండగా....అది కరెంట్ తీగల పై పడింది. గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించిన బాలుడు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాధ సంఘటన మైలార్ దేవ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

కాటేదాన్.. గణేష్ నగర్ కు చెందిన లక్ష్మీ వివేక్ స్థానికంగా 5వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు స్థానికంగా మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా... బాలుడు మంగళవారం మధ్యాహ్నం పతంగి ఎగరవెస్తుండగా...... కొద్దిసేపటి తర్వాత అది తెగి సమీపంలో ఉన్న విద్యుత్ తీగ పై పడింది.

దానిని తీసుకునేందుకు లక్ష్మీ వివేక్ దగ్గరలో ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి పతంగిని తీసుకునే ప్రయత్నం చేయగా కరెంట్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.

పోలీసులు బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడు విద్యుత్ దాఘుతంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు ఘటన స్థలం చేరుకొని వివరాలు సేకరించారు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈశ్వర్ ప్రసాద్ స్థానికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గాలిపటం ఎగరవెస్తూ మృతి చెందిన సంఘటన ఇది పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.

అల్వాల్ లో 20 ఏళ్ళ యువకుడు…

హైదరాబాదులోని అల్వాల్‌లో గాలిపటం ఎగుర వేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి లే ఆకాష్ అనే 20 ఏళ్ళ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్ నాగోల్ లో గాలిపటం ఎగర వేస్తూ....నాలుగు అంతస్తులు భవనం పైనుంచి పడిపోయి 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైకి వెళ్లిన శివకుమార్ గాలిపటం ఎగురవేస్తుండగా, కుక్క అరుస్తూ పిల్లలపైకి వచ్చింది. ఆ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివకుమార్ భవనం పైనుంచి పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు.

హైదరాబాదులో లంగర్ హౌస్ లో సంక్రాంతి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజ తగిలి ఇండియన్ ఆర్మీలో పనిచేసే కోటేశ్వర్ రెడ్డి అనే జవాన్ప్రా ణాలు కోల్పోయాడు. సంక్రాంతి పండుగ రోజు రాత్రి విధుల నుంచి ఇంటి తిరిగి వెళుతుండగా, ఇందిరా నగర్ ఫ్లైఓవర్ పై చైనా మాంజ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు

స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన తోటి సిబ్బంది కొటిశ్వర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.మృతుడు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా...హైదరాబాద్ లో నివాసం ఉంటు ఆర్మీ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

సంగారెడ్డి జిల్లా జోగుపేట లో సంక్రాంతి పండుగ రోజు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సరదాగా పిల్లలతో కలిసి గాలిపటం ఎగరేస్తుండగా, పతంగి దారం కరెంట్ హై టెన్షన్ వైర్లకు చిక్కుకుంది.

గాలిపటం తీసే ప్రయత్నం చేయడంతో సుబ్రహ్మణ్యానికి కరెంటు తగలడంతో ఒకేసారి సుబ్రమణ్యం బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావం కావడంతో సుబ్రహ్మణ్యంను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

తదుపరి వ్యాసం