తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Water Supply : భాగ్యనగరంలో నీటి సరఫరాలో ఇబ్బందులు

Hyd Water supply : భాగ్యనగరంలో నీటి సరఫరాలో ఇబ్బందులు

HT Telugu Desk HT Telugu

16 August 2022, 8:09 IST

google News
    • హైదరాబాద్‌లో 36 గంటల పాటు  తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి జిహెచ్‌ఎంసితో పాటు పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని  హైదరాబాద్‌ మెట్రోపాలిటిన్‌ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది.  
హైదరాబాద్‌లో 36గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత
హైదరాబాద్‌లో 36గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత (AP)

హైదరాబాద్‌లో 36గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేత

భాగ్యనగరంలో 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. దాదాపు మూడున్నర లక్షల మంది వినియోగదారులకు సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని అందుకునే ప్రాంతాలకు ప్రధానంగా నీటి సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్‌ నగరానికి తాగునీటిని అందించే పైప్‌లైన్ల మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో అవాంతరాలు ఎదురవుతున్నట్లు మెట్రో వాటర్‌ సప్లై బోర్డు ప్రకటించింది.

స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ లో భాగంగా ఫలక్‌నామా జుబైల్‌ కాలనీలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో మిరాలం అలియా బాద్‌ జంక్షన్‌లో పైప్‌లైన్లను మార్చాల్సి వస్తోంది. దీంతో తాగునీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు.

కృష్ణాపైప్‌లైన్ల మరమ్మతుల కారణంగా మిరాలం, కిషన్‌ బాగ్‌, అల్‌జుబైల్ కాలనీ, సంతోష్‌ నగర్‌, విద్యా నగర్‌, సైదా బాద్‌, చంచల్‌గూడా, అస్మన్‌గడ్‌, యాకత్‌పురా, మదన్నపేట, మహబూబ్‌ మాన్షన్‌, రియాసత్‌నగర్‌, అలియాబాద్‌, బాలాపూర్‌, బొగ్గులకుంట, అప్ఝల్ గంజ్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, బొంగులూర్‌, మన్నెగూడ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు.

మెహదీపట్నం, కర్వాన్, లంగర్ హౌస్‌, కాకతీయ నగర్‌, హుమాయున్ నగర్‌, తాళ్లగడ్డ, అసిఫ్‌ నగర్‌, ఎంఇఎస్‌, షేక్‌పేట,ఓయూ కాలనీ, టోలీచౌక్‌, మల్లేపల్లి, విద్యానగర్, బొజగుట్ట, చింతల్ బస్తీ, షేక్‌ పేట, ఆళ్లబండ, జియా గూడ, రెడ్‌ హిల్స్‌, సెక్రటేరియట్‌, ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీ, గంగా మహాల్‌, హిమాయత్‌నగర్‌, హైదర్‌గూడ, రాజేంద్ర నగర్‌, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్‌, ఎంఎం పహాడీ, చింతల్మెట్‌, మణికొండ, గంధం గూడ, నార్సింగి, కిస్మత్ పురా, బాలాపూర్‌, మైసారం, బండ్లగూడ, బర్కాస్, మేకల బండి, బోలక్‌పూర్‌, తార్నాక, లాలాపేట, బుద్దనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఇఎస్‌, కంటోన్మెంట్, ప్రకాష్‌ నగర్‌, పాటిగడ్డ, హస్మత్ పేట, వనస్థలిపురం, ఆటోనగర్‌, మారుతీనగర్, మహీంద్ర హిల్స్‌ రామాంతపూర్, ఉప్పల్, నాచారం, హబ్బిగూడ, బీరప్పగడ్డ, బోడుప్పల్, మీర్‌పేట, బడంగ్‌పేట్‌, శాస్త్రిపురం, ఫిర్జాయిడూగ ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరా ఉంటుంది. బుధవారం రాత్రికి నీటి సరఫరాను పనరుద్ధరించనున్నారు.

తదుపరి వ్యాసం