IT Act Cases Siddipet : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. 21 మందిపై కేసులు
02 November 2023, 14:18 IST
- IT Act Cases in Siddipet: సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు చేసే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో IT చట్టం కింద 21 మంది పైన కేసులు నమోదు చేశారు.
IT చట్ట ప్రకారం 21 మంది పైన కేసులు
IT Act Cases in Siddipet : సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు మరియు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ… IT చట్ట ప్రకారం ఇలాంటి తప్పుడు పోస్ట్లు పెట్టిన 21 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది అని అన్నారు. గత కొన్ని రోజుల నుండి కొంతమంది యువకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ విద్వేషాలు పెంపొందించే విధంగా ఫోటోలు మార్పింగ్ చేసి, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా పోస్టులుపెడుతున్నారని, ఇలాంటి పోస్టుల పెట్టిన వారిపై సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో IT చట్ట ప్రకారం 21 కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.
ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆమె వివరించారు. వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అందరూ ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉందన్న విషయము గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, తప్పుడు వార్తలు పెట్టే వారిపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని శ్వేతా సూచించారు.
సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ కు 8712667100 తెలియజేయాలని. అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు పొలిసు అధికారులు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా యువత వారి యొక్క బావి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.