Women's T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ఇదే.. మరో ఇండోపాక్ మ్యాచ్
03 October 2022, 22:05 IST
- Women's T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను సోమవారం (అక్టోబర్ 3) ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా మరో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
Women's T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్‌కప్ వచ్చే ఏడాది మొదట్లో జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం (అక్టోబర్ 3) ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమివ్వనుండగా.. ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో ఇండియా.. పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్ 2లో ఉంది.
ఇక గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. మహిళల టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 10న సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 11న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఫిబ్రవరి 12న ఇండియా తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుండటం విశేషం.
2021లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతుల్లోనే ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా కూడా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నీలో ఇప్పటికే ఇండియా.. శ్రీలంక, మలేషియాలపై విజయాలు సాధించింది. ఇక 2023 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఫిబ్రవరి 26న జరగనుండగా.. కేప్‌టౌన్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్‌డేను కేటాయించారు. ఒక టీమ్ గ్రూప్ స్టేజ్‌లో తన గ్రూప్‌లోని ప్రతి టీమ్‌తో ఒక మ్యాచ్ ఆడుతుంది. టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్ చేరతాయి.
ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న ఇండియన్ వుమెన్స్ టీమ్.. ఆ తర్వాత ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 18న ఇంగ్లండ్, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెమీఫైనల్స్, ఫిబ్రవరి 26న ఫైనల్ జరుగుతుంది.