Virat Kohli World Records: విరాట్ ఒక్క హాఫ్ సెంచరీ.. రెండు వరల్డ్ రికార్డులు
04 September 2022, 22:24 IST
- Virat Kohli World Records: విరాట్ ఒక్క హాఫ్ సెంచరీతో రెండు వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో విరాట్ 60 రన్స్ చేసిన వియషం తెలిసిందే.
విరాట్ కోహ్లి
Virat Kohli World Records: రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసినట్లే. ఆసియా కప్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడతడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో మరో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్‌మేట్స్ అందరూ ఒక్కొక్కరుగా ఔటవుతున్న వేళ.. కోహ్లి మాత్రమే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో 60 రన్స్ చేశాడు. అతడు చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నాడు.
చివరికి విరాట్ 44 బాల్స్‌లో 60 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ ఈ ఏడాది ఆసియా కప్‌లో టాప్ స్కోరర్ అయ్యాడు. అంతేకాదు రెండు అద్భుతమైన వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో టీ20ల్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్‌కు టీ20ల్లో ఇది 32వ హాఫ్ సెంచరీ.
ఈ క్రమంలో అతడు కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 31వ హాఫ్ సెంచరీతో రోహిత్ రికార్డును సమం చేసిన అతడు.. ఈ ఇన్నింగ్స్‌తో అతన్ని మించిపోయాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి 44 బాల్స్‌లో 59 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై కోహ్లికిది 4వ హాఫ్ సెంచరీ.
దీంతో అతడు ఇంగ్లండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్, న్యూజిలాండ్ బ్యాటర్లు గప్టిల్, కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా బ్యాటర్ ఆరోన్ ఫించ్‌ల సరసన నిలిచాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో విరాట్ కోహ్లికి ఇది 194వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను అతడు మించిపోయాడు. ఈ 194 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లలో 70 సెంచరీలు ఉన్నాయి. ఈ ఫిఫ్టీ ప్లస్ స్కోర్లలో సచిన్ (264) టాప్ లో ఉన్నాడు.
ప్రస్తుతం ఆసియా కప్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి 154 రన్స్ చేశాడు. అతని సగటు 77 కావడం విశేషం. స్ట్రైక్ రేట్ 126.22గా ఉంది. ఈ క్రమంలో అతడు ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ గుర్బాజ్ (134)ను అధిగమించాడు.