Virat Kohli | కోహ్లీకి అదృష్టం ఆమడ దూరంలో.. మరోసారి గోల్డెన్ డకౌట్
20 April 2022, 7:07 IST
- విరాట్ కోహ్లీకి అదృష్టం పెద్దగా కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో రెండు సార్లు రనౌట్‌గా వెనుదిరిగినా మన రన్నింగ్ మెషిన్.. మంగళవారం నాడు లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీనే విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ
రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఈ సీజన్‌లో అస్సలు కలిసిరావడం లేదు. ఎంత కుదురుకుని బ్యాటింగ్ చేద్దామనుకున్నా.. ఏదోక రూపంలో వికెట్ పారేసుకుంటూ విఫలమవుతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీకి కలిసి రాలేదు. నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఫలితంగా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు,. లక్నో బౌలర్ దుశ్యంత చమీర బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
అప్పటికే చమీర అనూజ్ రావత్‌ను ఔట్ చేసి జోరు మీదున్నాడు. కోహ్లీ బలహీనత తెలిసిన రాహుల్.. చమీరాను ఆఫ్‌స్టంప్ దిశగా బంతిని వేయమని సలహా ఇచ్చాడు. అంతే చమీర ఆఫ్‌స్టంప్‌పై విసరగా.. కోహ్లీ అమాంతం దాన్ని బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఐపీఎల్ చరిత్రంలో విరాట్ గోల్డెన్ డకౌట్ అవ్వడం ఇది నాలుగో సారి. ఇంతకుముందు 2008లో ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో వెనుదిరగగా, 2014లో సందీప్ శర్మ, 2017లో నాథన్ కౌల్టర్ నైల్.. తాజాగా దుష్మంత చమీర బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.
చమీర బౌలింగ్‌లో విరాట్ ఔటయిన తర్వాత నిరాశగా వెనుదిరిగాడు కోహ్లీ. అప్పుడు విరాట్ ముఖ కవలికలు గమనిస్తే.. పాపం అనిపిస్తుంది. ఎంత బాగా ఆడదామనుకున్నా.. ఏదోక రూపంలో అదృష్టం కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో విరాట్ 119 పరుగులు మాత్రమే చేశాడు. అనవసర పరుగుకు ప్రయత్నించి రెండు సార్లు రనౌట్ కాగా.. ఓ సారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని బలయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 163 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. హేజిల్‌వుడ్ 4 వికెట్ల లక్నో పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసకెళ్లింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లిసిస్ అదరగొట్టాడు. 64 బంతుల్లో 96 పరుగులు చేసిన అతడు.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 13 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
టాపిక్