తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mumbai Indians | రోహిత్‌ దంచికొట్టు.. ముంబైని గెలిపించు: విరాట్‌, డుప్లెస్సి

Mumbai Indians | రోహిత్‌ దంచికొట్టు.. ముంబైని గెలిపించు: విరాట్‌, డుప్లెస్సి

HT Telugu Desk HT Telugu

21 May 2022, 15:01 IST

    • ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు వీరాభిమానులుగా మారిపోయారు ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెస్సి, మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి. ఆ టీమ్ గెలవాలని ఆరాటపడుతున్నారు.
విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి
విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి (IPLt20.com)

విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి

ముంబై: ఐపీఎల్‌ లీగ్‌ స్టేజ్‌ చివరికి వచ్చేసింది. శనివారం, ఆదివారం జరగబోయే రెండు మ్యాచ్‌లతో ఈ స్టేజ్‌ ముగుస్తుంది. ప్లేఆఫ్స్‌ కోసం ఒక బెర్త్‌ మాత్రమే ఖాళీ ఉంది. ఈ బెర్త్‌ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ ఇప్పటికే అన్ని మ్యాచ్‌లు ఆడేసింది. ఇక ఢిల్లీ మ్యాచ్‌ ఫలితాన్ని చూడటం తప్ప ఆ టీమ్ చేసేదేమీ లేదు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఇప్పుడందుకే ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెస్సి, విరాట్ కోహ్లి ముంబై ఇండియన్స్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ దంచి కొట్టాలని, ముంబైని గెలిపించాలని అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీతో ఆడబోయేది ముంబై ఇండియన్సే. ఈ సీజన్‌లో చివరి స్థానంలో ఉన్న ముంబై ఎప్పుడో ప్లేఆఫ్స్‌ ఆశలు వదులుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఢిల్లీని కూడా తనతో ఇంటికి తీసుకెళ్లిపోతుంది.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఆర్సీబీ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఆర్సీబీ కంటే ఢిల్లీ నెట్‌ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. అందువల్ల ముంబైపై గెలిస్తే చాలు ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీ ఓడిపోవాలని ఆర్సీబీ టీమ్‌ ప్రార్థిస్తోంది. ఇదే విషయాన్ని గుజరాత్‌తో మ్యాచ్‌ తర్వాత కోహ్లి, డుప్లెస్సి చెప్పారు.

ఈ మ్యాచ్‌లో ముంబైకి ఆర్సీబీ రూపంలో మరో 25 మంది సపోర్టర్లు ఎక్కువగా ఉంటారని విరాట్‌ అనడం విశేషం. వీలైతే తాము కూడా నేరుగా స్టాండ్స్‌లో కూర్చొని ఈ మ్యాచ్‌ చూస్తామని కూడా కోహ్లి చెప్పాడు. విరాట్ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న డుప్లెస్సి ముంబై, ముంబై అని అరవడం విశేషం.

అటు డుప్లెస్సి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌పై తాను ఆశలు పెట్టుకున్నానని, అతడు రెచ్చిపోయి ఆడి ముంబైని గెలిపించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి తన టీమ్‌ ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచిన విషయం తెలిసిందే.

టాపిక్

తదుపరి వ్యాసం