తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: స్కూటీపై విరాట్, అనుష్క షికార్లు - వైరల్ గా మారిన వీడియో

Virat Kohli: స్కూటీపై విరాట్, అనుష్క షికార్లు - వైరల్ గా మారిన వీడియో

HT Telugu Desk HT Telugu

21 August 2022, 13:49 IST

  • విరాట్ కోహ్లి, అనుష్క శర్మ శనివారం ముంబాయిలో స్కూటీపై షికార్లు కొట్టారు. వీరు స్కూటీపై ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ (Twitter)

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ

విశ్రాంతి కారణంగా వెస్టిండీస్, జింబాబ్వే టూర్స్ కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫ్యామిలీతో సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు. శనివారం విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబాయిలో స్కూటీ పై షికార్లు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఓ యాడ్ షూట్ కోసం అనుష్కతో కలిసి విరాట్ ముంబాయిలోని మధ్ ఐస్ ల్యాండ్ కు స్కూటీపైనే వెళ్లాడు. విరాట్ స్కూటీని డ్రైవ్ చేయగా అనుష్క వెనుక కూర్చున్నది. ఇద్దరు హెల్మెట్స్ ధరించి కనిపించింది. విరాట్ కోహ్లి బ్లూ షర్ట్ బ్యాక్ ప్యాంట్ ధరించగా అనుష్క ఫుల్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ ధరించింది. విరాట్, అనుష్క హెల్మెట్స్ ధరించిన పలువురు ఫ్యాన్స్ వీరిని గుర్తించి వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి విరాట్ ఇబ్బందులు పడుతున్నాడు.

ఐపీఎల్ తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నెలాఖరు నుండి మొదలయ్యే ఆసియా కప్ కోసం విరాట్ కోహ్లిని సెలెక్టర్లు ఎంపికచేశారు. తనపై వస్తోన్న విమర్శలకు ఈ ఆసియా కప్ తో సమాధానం ఇవ్వాలని విరాట్ ఎదురుచూస్తున్నాడు.