తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Women's World Cup | రెండు రోజులు.. రెండు సూపర్‌ క్యాచ్‌లు.. వీడియో

Women's World Cup | రెండు రోజులు.. రెండు సూపర్‌ క్యాచ్‌లు.. వీడియో

Hari Prasad S HT Telugu

12 March 2022, 11:28 IST

    • Women's World Cup.. మహిళల వరల్డ్‌కప్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లతో అదరగొడుతున్నారు ఫీల్డర్లు. మూడు రోజుల కిందట వెస్టిండీస్‌ ఫీల్డర్‌ డాటిన్‌ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్‌ను మరవక ముందే.. మరో ఇద్దరు ఫీల్డర్లు అలాంటి క్యాచ్‌లే పట్టుకున్నారు.
దీప్తి శర్మ క్యాచ్ పట్టిన ఆనందంలో హేలీ మాథ్యూస్
దీప్తి శర్మ క్యాచ్ పట్టిన ఆనందంలో హేలీ మాథ్యూస్ (AFP)

దీప్తి శర్మ క్యాచ్ పట్టిన ఆనందంలో హేలీ మాథ్యూస్

హామిల్టన్‌: ఒకప్పుడు పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌ చాలా స్లోగా సాగేది. భారీ స్కోర్లు నమోదయ్యేవి కావు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కూడా సాధారణంగానే ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మహిళా క్రికెటర్లు కూడా ఫిట్‌నెస్‌, ఆట విషయంలో మెన్‌ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కొన్ని కళ్లు చెదిరే క్యాచ్‌లే దీనికి నిదర్శనం. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ఫీల్డర్లు సూపర్‌ క్యాచ్‌లతో అదరగొట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విండీస్‌ ఫీల్డర్‌ డాటిన్‌ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పట్టిన క్యాచ్‌ టోర్నీకే హైలైట్‌గా నిలవగా.. తాజాగా శుక్ర, శనివారాల్లో జరిగిన రెండు మ్యాచ్‌లలో మరో రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్‌ షబ్నమ్‌ ఇస్మాయిల్‌ తన బౌలింగ్‌లోనే పట్టిన క్యాచ్‌ అద్భుతమనే చెప్పాలి. పాక్‌ బ్యాటర్‌ డయానా బేగ్‌ కొట్టిన షాట్‌ గాల్లోకి ఎగరగా.. మిడ్‌ వికెట్‌ వైపు చాలా దూరం పరుగెత్తి క్యాచ్‌ అందుకుంది.

ఇక శనివారం ఇండియాతో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఫీల్డర్‌ హేలీ మాథ్యూస్‌ స్లిప్స్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకుంది. దీప్తి శర్మ కొట్టి స్వీప్‌ షాట్‌ వికెట్‌ కీపర్‌ మీదుగా గాల్లోకి ఎగరగా.. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మాథ్యూస్‌.. ఒంటిచేత్తో ఆ క్యాచ్‌ అందుకుంది.

టాపిక్

తదుపరి వ్యాసం