తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sa20 Auction: సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ట్రిస్టన్ స్టబ్స్‌కు భారీ మొత్తం.. సఫారీ కెప్టెన్లపై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు

SA20 Auction: సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో ట్రిస్టన్ స్టబ్స్‌కు భారీ మొత్తం.. సఫారీ కెప్టెన్లపై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు

20 September 2022, 10:45 IST

google News
    • Highest Price in SA20 League: ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) ఫ్రాంచైజీతో తీవ్రంగా పోటీ పడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టు చివరకు భారీ మొత్తానికి ట్రిస్టన్ స్టబ్స్‌ను కొనుగోలు చేసింది. అతడి తర్వాత డొనావన్ ఫియర్రాను సూపర్ కింగ్స్ జట్టు అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.
ఎస్ఏ 20 వేలం
ఎస్ఏ 20 వేలం (Twitter)

ఎస్ఏ 20 వేలం

Tristan Stubbs in SA20 Auction: ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టీ20 లీగ్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్ఏ20 లీగ్(SA20 League Auction)కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలం కేప్ టౌన్ వేదికగా జరిగింది. ఈ వేలంలో అత్యధికంగా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ రికార్డు ధర పలికాడు. అతడిని 9.2 మిలియన్ ర్యాండ్లకు (రూ.4 కోట్ల 14 లక్షలు) సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు సొంతం చేసుకుంది. ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) ఫ్రాంచైజీతో తీవ్రంగా పోటీ పడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ జట్టు చివరకు భారీ మొత్తానికి ట్రిస్టన్ స్టబ్స్‌ను కొనుగోలు చేసుకుంది.

ఇంత వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని మరో ఆటగాడు డోనావన్ ఫియర్రా కూడా భారీ మొత్తం పలికాడు. 1,75,000 ర్యాండ్(రూ.7 లక్షల 88 వేల) బేసిక్ ప్రైజ్‌ ఉన్న ఇతడిని.. సూపర్ కింగ్స్ జట్టు 5.5 మిలియన్ ర్యాండ్(రూ.2 కోట్ల 47 లక్షలు)కు సొంతం చేసుకుంది. ఈ 24 ఏళ్ల ఈ ఆల్ రౌండర్‌కు ఇంత వరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం. డోనావన్ కోసం పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు వేలంలో పోటీ పడి సూపర్ కింగ్స్ జట్టు భారీ మొత్తానికి అతడిని కొనుగోలు చేసింది. అతడు ఇప్పటి వరకు 148.26 స్ట్రైక్ రేటుతో కేవలం 19 టీ20లు మాత్రమే ఆడాడు.

సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌కు వేలంలో నో ఛాన్స్..

డ్వాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్ సోదరులకు వేలంలో మంచి డిమాండ్ ఏర్పడింది. మార్కోను సన్‌రైజర్స్ 6.1 మిలియన్ ర్యాండ్లకు(రూ.2 కోట్ల 74 లక్షలు) పలకగా.. డ్వాన్‌ను ఎంఐ కేప్ జట్టు 3.3 మిలియన్లు(రూ. కోటి 48 లక్షలు) ధరపలికాడు. మరోపక్క రీలే రసోను ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు 6.9 మిలియన్(రూ. 3 కోట్ల 10 లక్షలు)కు సొంతం చేసుకుంది. వేన్ పార్నెల్‌ను సూపర్ కింగ్స్ జట్టు 5.6 మిలియన్(దాదాపు రూ.2 కోట్ల 50 లక్షలు)కు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ టెంబా బవుమా, టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గార్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

SA20 లీగ్ జట్లు..

డర్బన్ సూపర్ జెయింట్స్..

క్వింటన్ డి కాక్, ప్రెన్లిన్ సుబ్రాయెన్, జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లే, హెన్రీ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహారాజ్, కైల్ అబాట్, జూనియర్ డాలా, దిల్షాన్ మదుషనకా, జాన్సన్ ఛార్లెస్, మాథ్యూ బ్రీట్కే, క్రిస్టియన్ జోన్కర్, వియాన్ మల్దర్, సైమన్ హామర్.

జోహన్స్ బర్గ్ సూపర్ కింగ్స్..

ఫాఫ్ డుప్లెసిస్, గెరాల్డ్ కోట్జే, మహీశ్ తీక్షణ, రొమారియో షెపర్డ్, హ్యారీ బ్రూక్, జానెమన్ మలన్, రీచా హెండ్రిక్స్, కైల్ వేరియెన్, జార్జ్ గార్డన్, అల్జారీ జోసెఫ్, లూయిస్ డూ ప్లూయ్, లూయిస్ గ్రెగరీ, లిజాడ్ విలయమ్స్, డొనావన్ ఫియర్రా, నంద్రే బర్గర్, మలీస్ సిబోటో కాలెబ్ సెలెకా.

ఎంఐ కేప్‌టౌన్..

కగిసో రబాడా, డెవాల్డ్ బ్రూవీస్, రషీద్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, రీ వ్యాండెర్ డసేన్, రియాన్ రికెల్టాన్, జార్జ్ లిండే, బ్యూరాన్ హెండ్రిక్స్, డ్వాన్ జన్సెన్, డెలానో పాట్‌జియాటర్, గ్రాండ్ రోల్‌ఫ్సెన్, వెస్లీ మార్షల్, ఆలీ స్టోన్, వకార్ సలామ్‌ఖీల్, జియాద్ అబ్రామ్స్, ఓడెన్ స్మిత్.

పార్ల్ రాయల్స్..

డేవిడ్ మిల్లర్, కార్బిన్ బాష్, జోస్ బట్లర్, ఒబెడ్ మెక్‌కాయ్, లుంగి ఎన్‌గిడి, తబ్రైజ్ షమ్సీ, జాసన్ రాయ్, డేన్ విలాస్, జోర్న్ ఫార్టుయిన్, విహాన్ లుబ్బే, ఫెరిస్కో ఆడమ్స్, ఇమ్రాన్ మనక్, ఇవాన్ జోన్స్, రామన్ సిమండ్స్, మిచెల్ బ్యూరేన్, ఇమోన్ మోర్గాన్, కోడి యూసుఫ్.

ప్రిటోరియా క్యాపిటల్స్..

అన్రిచ్ నోర్ట్జే, మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసోవ్, ఫిల్ సాల్ట్, వేన్ పార్నెల్, జోష్ లిటిల్, షాన్ వాన్ బెర్గ్, ఆదిల్ రషీద్, కామెరాన్ డెల్పోర్ట్, విల్ జాక్స్, థియునిస్ డి బ్రూయిన్, మార్కో మరైస్, ఫిల్ సాల్ట్, డార్యిన్ డుపవిలోన్, కుసల్ మెండిస్, జిమ్మీ నీషమ్, ఈథన్ బాష్, షేన్ డాడ్స్‌వెల్.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్..

ఐడెన్ మార్క్‌రామ్, ఒట్నీల్ బార్ట్‌మాన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, సిసాండా మగలా, జునైద్ దావూద్, మాసన్ క్రేన్, JJ స్మట్స్, జోర్డాన్ కాక్స్, ఆడమ్ రోసింగ్‌టన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, మార్క్వెస్ అకెర్‌మాన్, జేమ్స్ అకెర్‌మాన్, ఎ టామ్‌క్మానే, , సారెల్ ఎర్వీ, బ్రైడన్ కార్సే.

తదుపరి వ్యాసం