Tilak Varma : అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఫిఫ్టీ.. రోహిత్ శర్మ కూతురికి అంకితమిచ్చిన తిలక్ వర్మ.. కారణమేంటి?
07 August 2023, 12:06 IST
- Tilka Varma Fist Fifty : భారత యువ ఆటగాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి అర్ధ సెంచరీని చేశాడు. అయితే రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
తిలక్ వర్మ
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 20 ఏళ్ల తిలక్ వర్మ 2 సిక్సర్లతో తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన తిలక్ వర్మ 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. రెండో టీ20 మ్యాచ్ లో ఒత్తిడి వాతావరణంలో ఆడుతూ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్ వర్మకు ఇది తొలి అర్ధశతకం. రెండు బొటనవేళ్లను విభిన్నంగా చూపిస్తూ చిన్నపిల్లాడిలా ఈ యాభైని సెలబ్రేట్ చేసుకున్నాడు.
దీంతో తిలక్ వర్మ వేడుక ఎవరిని ప్రమోట్ చేస్తుందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ'ఈ అర్ధ సెంచరీని రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితమిస్తున్నాను. అందుకే ఇలాంటి వేడుక చేశాను. చాలా కాలంగా మేం కలిసి ఆడుకుంటున్నాం.' అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
అందుకే తొలి అర్ధ సెంచరీ, సెంచరీ సాధించినప్పుడల్లా సమైరాకు అంకితం చేస్తానని తిలక్ వివరించాడు. మేము అలా ఆడతాము కాబట్టి నేను అలా వేళ్లతో వేడుక చేసి వ్యక్తపరిచానని తెలిపాడు. అలాగే క్రికెట్ కెరీర్‌లో రోహిత్, రైనా ఇద్దరూ రోల్ మోడల్స్ అని వెల్లడించాడు.
'ఐపీఎల్ తొలి సీజన్‌లో రోహిత్ శర్మతో చాలా సమయం గడిపాను. అప్పుడు రోహిత్ శర్మ నువ్వు త్రీ ఫామ్ ప్లేయర్ అని నాకు నమ్మకం కలిగించాడు. అతని మాటలు నాకు ఫీల్డ్‌లో గైడ్‌గా పనిచేశాయి.' అని తిలక్ వర్మ వెల్లడించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. వెస్టిండీస్‍తో జరిగిన రెండో టీ20లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. విండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు అంతర్జాతీయ మ్యాచ్‍లు ఓడిపోవడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి. గయానా వేదికగా ఆగస్టు 6న జరిగిన రెండో టీ20లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో పరాజయం చెందింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‍లో వెస్టిండీస్ 2-0తో ఆధిక్యాన్ని పెంచుకుంది.