Neeraj Chopra Prize money: వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్‌తో పాటు నీరజ్ గెలిచిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
28 August 2023, 18:16 IST
- Neeraj Chopra Prize money: వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్‌తో పాటు నీరజ్ గెలిచిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? ఈ విజయం ద్వారా ఒలింపిక్స్ తోపాటు వరల్డ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా నీరజ్ నిలిచిన విషయం తెలిసిందే.
నీరజ్ చోప్రా
Neeraj Chopra Prize money: ఇండియా జావెలిన్ త్రో హీరో మరోసారి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట టోక్యో ఒపింపిక్స్ లో ఇండియా తరఫున తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ గోల్డ్ మెడల్ గెలిచిన నీరజ్.. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ లోనూ అదే ఫీట్ రిపీట్ చేశాడు. ఇప్పటి వరకూ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో ఏ ఇండియన్ అథ్లెట్ కూడా గోల్డ్ మెడల్ గెలవలేదు.
ఇప్పుడా రికార్డును నీరజ్ చోప్రా తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో జావెలిన్ ను 88.17 మీటర్లు విసిరి నీరజ్ గోల్డ్ గెలిచాడు. అయితే ఈ గోల్డ్ మెడల్ తోపాటు నీరజ్ కు భారీ ప్రైజ్ మనీ కూడా సొంతమైంది. విజేతకు 70 వేల డాలర్లు దక్కాయి. అంటే మన కరెన్సీలో సుమారు రూ.58 లక్షలు. మరోవైపు రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచిన పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ కు 35 వేల డాలర్లు (సుమారు రూ.29 లక్షలు) దక్కాయి.
మూడోస్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలిచిన వాద్లెచ్ కు రూ.18 లక్షలు దక్కడం విశేషం. ఇక ఈ ఫైనల్లో నీరజ్ తోపాటు మరో ఇద్దరు టాప్ 8లో నిలిచారు. కిశోర్ జేనా (84.77 మీటర్లు), డీపీ మను (84.14 మీటర్లు) ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈ ఫైనల్లో నీరజ్ చోప్రా తొలి అటెంప్టే ఫౌల్ అయింది. అయితే రెండో అటెంప్ట్ లో అత్యధిక దూరం విసిరిన నీరజ్.. తర్వాత తన లీడ్ ను అలాగే కొనసాగించాడు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ కాకుండా గతంలో షూటర్ అభినవ్ బింద్రా వరుసగా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ గెలిచాడు. అథ్లెటిక్స్ లో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ నీరజ్ చోప్రా. గతేడాది సిల్వర్ తో సరిపెట్టుకున్న నీరజ్.. ఈసారి మాత్రం పట్టు వదల్లేదు. క్వాలిఫయర్స్ లో తన సీజన్ బెస్ట్ త్రోతో క్వాలిఫై అయిన అతడు.. ఫైనల్లో అంతకంటే తక్కువ దూరమే విసిరినా గోల్డ్ సాధించాడు.