Asia Cup: పాకిస్థాన్ మ్యాచ్ లో ఓడినా టీమ్ ఇండియా ఫైనల్ చేరుకుంటుంది - ఎలా అంటే
05 September 2022, 11:23 IST
Asia Cup: ఆదివారం పాకిస్థాన్ చేతిలో టీమ్ ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఇంకా టీమ్ ఇండియాకు ఫైనల్ చేరుకునే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. అది ఎలాగంటే...
రోహిత్ శర్మ
Asia Cup: ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ రౌండ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఓటమి పాలవ్వడంతో క్రికెట్ అభిమానులు నిరాశలో ముగినిపోయారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి రాణించిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడం, కీలక సమయాల్లో బౌలర్లు చేతులెత్తేయడంతో టీమ్ ఇండియా ఓడిపోయింది. పాకిస్థాన్ చేతిలో ఓడిపోయినా ఆసియా కప్ లో ఫైనల్ చేరడానికి టీమ్ ఇండియాకు ఇంకా అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.
రానున్న రెండు మ్యాచుల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లతో భారత్ తలపడనున్నది. ఈ రెండు మ్యాచ్‌లలో భారత్ విజయాల్ని సాధించాలి. అలాగే శ్రీలంకను పాకిస్థాన్ ఓడించాలి. అప్పుడే శ్రీలంక, ఆఫ్ఘన్ సూపర్ ఫోర్ నుండి నిష్క్రమించి టీమ్ ఇండియా ఫైనల్ చేరగలుగుతంది. ఫైనల్‌లో మరోసారి పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా పోటీపడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాకిస్థాన్‌పై శ్రీలంక గెలిస్తే నెట్‌రన్ రేట్ ఎక్కువగా ఉన్న జట్టుకు ఫైనల్ చేరే ఛాన్స్ దక్కుతుంది.
ప్రస్తుతం నెట్ రేన్ రేట్‌లో శ్రీలంక +0. 589 టాప్ ప్లేస్ లో ఉండగా పాకిస్థాన్ +0. 126 సెకండ్ ప్లేస్ లో ఉంది. వాటి తర్వాత టీమ్ ఇండియా -0.126తో మూడో స్థానంలో ఉంది. రన్ రేట్ మెరుగు పడాలంటే రానున్న రెండు మ్యాచుల్లో టీమ్ ఇండియా భారీ తేడాతో గెలవాలి. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ఆడినప్పుడే టీమ్ ఇండియా గెలవగలుగుతుంది.