తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  World Cup Schedule: టీమ్ ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ ఇదేనా? - ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ ఆడటం లేదా?

World Cup Schedule: టీమ్ ఇండియా వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ ఇదేనా? - ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ ఆడటం లేదా?

HT Telugu Desk HT Telugu

12 June 2023, 11:41 IST

google News
  • World Cup Schedule: ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ప్రారంభంకానున్న‌ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ ఇండియా షెడ్యూల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. ఇందులో ఉప్ప‌ల్ స్టేడియంలో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌టం లేద‌ని స‌మాచారం.

టీమ్ ఇండియా
టీమ్ ఇండియా

టీమ్ ఇండియా

World Cup Schedule: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని ఎదురుచూస్తోన్న తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమ్ ఇండియా ఆడ‌నున్న మ్యాచ్‌ల‌కు సంబంధించిన‌ వేదిక‌ల‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిసింది. ఈ వేదిక‌ల్లో ఉప్ప‌ల్ స్టేడియానికి చోటు ద‌క్క‌న‌ట్లు స‌మాచారం. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అక్టోబ‌ర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదిక‌గా టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఆ త‌ర్వాత ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌, పూణే, ధ‌ర్మ‌శాల‌, ల‌క్నో, ముంబై, కోల్‌క‌తా వేదిక‌లుగా త‌దుప‌రి మ్యాచ్‌ల‌ను ఆడ‌బోతున్న‌ట్లు తెలిసింది. టీమ్ ఇండియా క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ కూడా బెంగ‌ళూరులో జ‌రుగ‌నున్న‌ట్లు తెలిసింది. అన్ని ప్ర‌ధాన స్టేడియాల‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించిన బీసీసీఐ ఉప్ప‌ల్ స్టేడియాన్ని మాత్రం విస్మ‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఉప్ప‌ల్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌ల‌ను జ‌రుగ‌నున్న‌ట్లు తెలిసింది.

వ‌న్డే వ‌ర‌ల్ట్ క‌ప్ కోసం పాకిస్థాన్ రెండు క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌ల‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌ల‌కు ఉప్ప‌ల్‌లో ఛాన్స్ ఇచ్చి టీమ్ ఇండియా మ్యాచ్‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌ను డిజ‌పాయింట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మొత్తానికి టీమ్ ఇండియా ఆతిథ్యం ఇవ్వ‌బోతుండ‌టం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో 1987, 1996, 2011ల‌లో మిగిలిన ఆసియా దేశాల‌తో క‌లిసి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు టీమ్ ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి మాత్రం మొత్తం మ్యాచ్‌ల‌న్నీ ఇండియాలోనే జ‌రుగ‌నున్నాయి.

తదుపరి వ్యాసం