తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India New Jerseys: టీమిండియా కొత్త వన్డే, టీ20, టెస్టు జెర్సీలు చూశారా?

Team India new jerseys: టీమిండియా కొత్త వన్డే, టీ20, టెస్టు జెర్సీలు చూశారా?

Hari Prasad S HT Telugu

02 June 2023, 11:29 IST

    • Team India new jerseys: టీమిండియా కొత్త వన్డే, టీ20, టెస్టు జెర్సీలు చూశారా? కొత్త కిట్ స్పాన్సర్ అడిడాస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు ఈ కొత్త జెర్సీలను లాంచ్ చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ (PTI)

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్

Team India new jerseys: టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ కొత్త జెర్సీలను లాంచ్ చేసింది. ఈ మధ్యే బీసీసీఐ కాంట్రాక్ట్ అందుకున్న ఈ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు ముందు ఈ కొత్త జెర్సీలను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. గురువారం (జూన్ 1) ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త జెర్సీల వీడియోను పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఇందులో టీమిండియా కొత్త వన్డే, టీ20, టెస్టు జట్ల జెర్సీలను చూడొచ్చు. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో నుంచి ఈ జెర్సీలు వస్తున్నట్లుగా వీడియోలో చూపించారు. ఈ కొత్త జెర్సీలు జూన్ 4 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అడిడాస్ ఇండియా వెబ్‌సైట్ (www.adidas.co.in) ద్వారా ఈ కొత్త జెర్సీలను అభిమానులు ఆర్డర్ చేసుకోవచ్చు.

జూన్ 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ కొత్త జెర్సీలతో టీమిండియా బరిలోకి దిగనుంది. గత నెలలోనే టీమిండియా అధికారిక కిట్ స్పాన్సర్ గా అడిడాస్ ను ప్రకటించింది బీసీసీఐ. ఈ మధ్యే కొత్త ట్రైనింగ్ కిట్ ను తీసుకొచ్చిన అడిడాస్.. తాజాగా కొత్త జెర్సీలను లాంచ్ చేసింది. ఈ కొత్త జెర్సీలు ఇంచుమించు ఇప్పటి వరకూ వాడిన జెర్సీల్లాగే ఉన్నాయి.

మరోవైపు జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ కోసం ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఐపీఎల్ కారణంగా విడతల వారీగా ఇంగ్లండ్ చేరుకున్న ప్లేయర్స్.. నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 2013 తర్వాత మరో ఐసీసీ టైటిల్ కోసం చూస్తున్న ఇండియన్ టీమ్.. ఈసారి పదేళ్ల ఎదురుచూపులకు ముగింపు పలకాలని భావిస్తోంది.

తదుపరి వ్యాసం