తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar Yadav Number 1 Batter: టీ20ల్లో సూర్యకుమార్‌ నంబర్ వన్‌

Suryakumar Yadav Number 1 Batter: టీ20ల్లో సూర్యకుమార్‌ నంబర్ వన్‌

Hari Prasad S HT Telugu

02 November 2022, 14:31 IST

    • Suryakumar Yadav Number 1 Batter: టీ20ల్లో సూర్యకుమార్‌ నంబర్ వన్‌ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. అతడు పాకిస్థాన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి తొలిసారి టాప్‌లోకి వచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (ANI )

సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav Number 1 Batter: టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ టీ20ల్లో తొలిసారి టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చాడు. ఈ మధ్యే టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికాపై 68 రన్స్‌ చేసిన కొన్ని రోజుల్లోనే సూర్య చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టాప్‌ ర్యాంక్‌ సొంతమైంది. అతడు పాకిస్థాన్‌ ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి తొలిసారి ఈ టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో అతడు విఫలమైనా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా సూర్య హాఫ్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా, 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచిన సూర్య చాలా రోజులుగా టీ20 ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉంటూ వస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ అతడు 15, 51, 68 స్కోర్లు చేశాడు.

విరాట్ కోహ్లి తర్వాత టీ20ల్లో టాప్ ర్యాంక్‌ అందుకున్న రెండో ఇండియన్‌ ప్లేయర్‌గా కూడా సూర్య నిలిచాడు. ఓవరాల్‌గా నంబర్‌ 1 ర్యాంక్‌ సొంతం చేసుకున్న 23వ ప్లేయర్‌ అతడు. "నెదర్లాండ్స్‌పై 25 బాల్స్‌లోనే 51 రన్స్‌, పెర్త్‌లో సౌతాఫ్రికాపై 40 బాల్స్‌లో 68 రన్స్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్‌ కాన్వే, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌లను వెనక్కి నెట్టి టాప్‌ ర్యాంక్ అందుకున్నాడు" అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 4 నుంచి రిజ్వాన్‌ నంబర్‌ 1గా కొనసాగుతున్నాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై సెంచరీ చేసిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కూడా కెరీర్‌ బెస్ట్‌ ఏడో ర్యాంక్‌ అందుకున్నాడు. అటు ఈ వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌ రైలీ రూసో కూడా కెరీర్‌ బెస్ట్‌ 8వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడు ఏకంగా 17 స్థానాలు ఎగబాకాడు.

తదుపరి వ్యాసం