Sunrisers Hyderabad | వి లవ్ బిర్యానీ.. సన్రైజర్స్ టీమ్ పాడిన పాట చూశారా?
23 April 2022, 17:52 IST
- వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్.. అదే ఊపులో ఓ పాట రాసి, పాడారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్తోపాటు టీమ్ మెంబర్స్ పాడిన 'వి లవ్ బిర్యానీ' అంటూ సాగే ఆ పాట వైరల్ అవుతోంది.
సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్స్ మార్ క్రమ్, కేన్ విలియమ్సన్, సమద్, ఫిలిప్స్
ముంబై: ఈ సీజన్ ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్లు ఓడినా.. తర్వాత వరుసగా నాలుగు గెలిచింది సన్రైజర్స్ హైదరాబాద్. ఈ విజయాలు తెచ్చిన కిక్కో ఏమోగానీ టీమ్ ప్లేయర్స్ తమపై తామే ఓ పాట రాసుకొని, పాడారు. వి ఆర్ సన్రైజర్స్.. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్.. వి లవ్ బిర్యానీ అంటూ సాగే ఆ పాటను కెప్టెన్ విలియమ్సన్తోపాటు మరో ముగ్గురు ప్లేయర్స్ కలిసి పాడారు. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముందు ఈ వీడియోను సన్రైజర్స్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ది హైదరా-బూగీ బాయ్బ్యాండ్ పేరుతో కెప్టెన్ విలియమ్సన్ గ్రూప్ ఏర్పాటు చేసి ఈ పాట పాడటం విశేషం. ఈ వీడియోలో విలియమ్సన్తోపాటు ఏడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్ పాట పాడటం చూడొచ్చు. విలియమ్సన్ గిటార్ వాయిస్తూ పాట పాడాడు. వి ఆర్ సన్రైజర్స్ అంటూ మొదలై.. వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వి లవ్ బిర్యానీ అని సాగే ఈ పాటలో టీమ్ మెంబర్స్, సపోర్ట్ స్టాఫ్ పేర్లన్నీ రావడం విశేషం. ఈ పాటను తామే రాసినట్లు వీడియో ప్రారంభంలో విలియమ్సన్ చెప్పాడు.కేన్ మామా అండ్ కో నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ అంటూ సన్రైజర్స్ ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియో పోస్ట్ చేసింది.
ఐపీఎల్ 2022లో రాజస్థాన్, లక్నో చేతుల్లో ఓడిన సన్రైజర్స్.. తర్వాత వరుసగా చెన్నై, గుజరాత్, కోల్కతా, పంజాబ్ కింగ్స్లపై గెలిచింది. శనివారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి తమ విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది.
టాపిక్