తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sunil Joshi On Chahal: చాహల్ కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నాడు.. అది మార్చుకోవాలి.. భారత మాజీ స్పష్టం

Sunil Joshi on Chahal: చాహల్ కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నాడు.. అది మార్చుకోవాలి.. భారత మాజీ స్పష్టం

02 February 2023, 20:15 IST

google News
    • Sunil Joshi on Chahal: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కంఫర్టబుల్ ఫేజ్ నుంచి బయటకు రావాలని టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషీ అభిప్రాయపడ్డారు.
చాహల్‌తో టీమిండియా ఆటగాళ్లు
చాహల్‌తో టీమిండియా ఆటగాళ్లు (BCCI Twitter)

చాహల్‌తో టీమిండియా ఆటగాళ్లు

Sunil Joshi on Chahal: యజవేంద్ర చాహల్ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు రాను రాను పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని క్లిష్టతరం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో అతడి సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతుండగా చాహల్ మాత్రం వెనుకబడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో(వన్డేలు, టీ20లు కలిపి) అతడు కేవలం రెండింటిలోనే ఆడాడు. దీంతో అతడి ఫామ్‌పై మాజీలు సైతం విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషీ కూడా ఇదే స్పందనను తెలియజేశారు.

"సుదీర్ఘ కెరీర్‌లో ప్రతి బౌలర్ కొంత కాలం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం చాహల్ కూడా అదే ఫేజ్‌లో ఉన్నాడు. మిడిల్‌లో చాహాల్ లాంటి బౌలర్లకు గేమ్ టైమ్ దొరకపోతే బహుశా దేశవాలీ క్రికెట్‌లోనైనా ఆడతానని జట్టు మేనేజ్మెంట్‌ను అడగాలి. ఎందుకంటే మ్యాచ్ సమయం అతడు తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఉపయోగపడుతుంది. చాహల్‌కు అదే మంచి ప్రిపరేషన్." అని సునీల్ జోషీ అభిప్రాయపడ్డారు.

"చాహల్ ఎటాకింగ్ స్పిన్నరని సునీల్ ప్రశంసించారు. అతడు మంచి ఎటాకింగ్ స్పిన్నర్. ప్రతి ఒక్కరూ తమ ప్రదర్శనను చూసి సంబరపడొచ్చు. నేను ఈ రోజు బాగా ఆడాను. కొంచెం రిలాక్స్ అవుతాను అనుకోవచ్చు. కానీ ఆ సమయమే మీపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంటుంది. ఈ విషయంపై చాహల్ కూడా ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా బంతి ఫాలో త్రూపై దృష్టి సారించాలి. అతడి ఆర్మ్ స్పీడ్ ఎక్కువ. కాబట్టి బంతిని స్పిన్ చేయడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు అతడు బంతిని పుష్ చేయడం వల్ల దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు." అని సునీల్ జోషి తెలిపారు.

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేయగా.. టీ20 సిరీస్‌లో మాత్రం 2-1 తేడాతో గెలిచింది. అనంతరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

తదుపరి వ్యాసం