Stuart Broad: కెరీర్ చివరి బాల్‌కు సిక్స్ కొట్టిన ఏకైక క్రికెటర్‌గా బ్రాడ్ రికార్డ్...
01 August 2023, 11:02 IST
Stuart Broad: యాషెస్ ఐదో టెస్ట్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రాడ్ కెరీర్ చివరి బంతికి వికెట్‌తో పాటు సిక్సర్ కొట్టిన ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
స్టువర్ట్ బ్రాడ్
Stuart Broad: క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తించిన యాషెస్ సిరీస్ చివరకు 2-2తో సమంగా ముగిసింది. చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య విజయం దోబూచులాడింది. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో ఐదో టెస్ట్‌లో పరాజయం పాలైంది. వోక్స్, మెయిన్ అలీ, బ్రాడ్ ఇంగ్లాండ్‌ను గెలిపించి పరువు కాపాడారు.
యాషెస్ ఐదో టెస్ట్ తో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. చివరి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాను గెలిపించేందుకు పట్టుదలతో పోరాడుతోన్న అలెక్స్ క్యారీ, టాడ్ మర్ఫీలను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. కాగా ఈ ఐదో టెస్ట్‌లో స్టువర్ట్ బ్రాడ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు.
బ్యాటింగ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా మిగిలిన బ్రాడ్ తాను ఎదుర్కొన్న చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా చివరి వికెట్ బ్రాడ్‌కు దక్కింది. అలెక్స్ క్యారీని బ్రాడ్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా ఆలౌటైంది. టెస్ట్ కెరీర్‌లో తాను సంధించిన చివరి బాల్‌కు వికెట్ తీసిన క్రికెటర్‌గా బ్రాడ్ నిలిచాడు. కెరీర్ చివరి బాల్‌కు సిక్సర్‌తో పాటు వికెట్ తీసిన ఏకైక క్రికెటర్‌గా బ్రాడ్ నిలిచాడు.
604 వికెట్లు...
సుదీర్ఘ కెరీర్‌లో 167 టెస్ట్‌లు ఆడిన స్టువర్ట్ బ్రాడ్ 604 వికెట్లు తీసుకున్నాడు. పది వికెట్లను మూడు సార్లు, ఐదు వికెట్ల ప్రదర్శనను 20 సార్లు పునరావృతం చేశాడు. బ్యాటింగ్‌లో రాణించిన బ్రాడ్ 3662 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 13 హాఫ్ సెంచరీలు చేశాడు. 2007లో శ్రీలంకపై తొలి టెస్ట్ ఆడాడు బ్రాడ్.