Fifa World Cup 2022 Records: స్పెయిన్ మిడ్ ఫీల్డర్ గవి అరుదైన రికార్డ్ - పీలే తర్వాత అతడే
24 November 2022, 11:53 IST
Fifa World Cup 2022 Records: ఫిఫా వరల్డ్ కప్‌లో స్పెయిన్ మిడ్ పీల్డర్ గవి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వరల్డ్ కప్‌లో గోల్ చేసిన అత్యంత పిన్నవయస్కులలో ఒకడిగా నిలిచాడు.
గవి
Fifa World Cup 2022 Records: ఫిఫా వరల్డ్ కప్‌లో బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 7-0 తేడా ఘన విజయాన్ని సాధించింది. కోస్టారికాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరచిన స్పెయిన్ గోల్స్ వర్షం కురిపించింది. స్పెయిన్ దెబ్బకు డీలా పడిన కోస్టారికా ఒక్కసారి కూడా గోల్ చేసేందుకు ఈ మ్యాచ్‌లో ప్రయత్నించలేదు.
ఈ మ్యాచ్‌లో స్పెయిన్ తరఫునఫెర్రాన్ టోరెస్ రెండు గోల్స్ చేయగా, ఓల్మో, అసెన్సియో, గవి, సోలెర్, మోరాటా తలో ఒక్క గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా స్పెయిన్ మిడ్ ఫీల్డర్ గవి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు.
వరల్డ్ కప్‌లో గోల్ కొట్టిన అతి పిన్నవయస్కుల జాబితాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మొదటి స్థానంలో ఉన్నాడు. 1958 వరల్డ్ కప్‌లో పీలే స్వీడన్‌పై 17 సంవత్సరాల 249 రోజుల్లో గోల్ కొట్టాడు. ఆ తర్వాత మెక్సికన్ ప్లేయర్ రోసెస్ రెండో స్థానంలో నిలిచాడు. (18 సంవత్సరాల 93 రోజులు).
బుధవారం కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టిన గవి (18 సంవత్సరాల 110 రోజులు) పిన్న వయస్కుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. వరల్డ్ కప్‌లో స్పెయిన్‌కు ఇదే అతి పెద్ద గెలుపు కావడం గమనార్హం. 2010 వరల్డ్‌కప్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. 2018లో రౌండ్ 16కు చేరకున్న స్పెయిన్ పదో ప్లేస్‌లో నిలిచింది.