తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa: క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్...రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం

IND vs SA: క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్...రెండో టీ20లో సౌతాఫ్రికా విజయం

HT Telugu Desk HT Telugu

12 June 2022, 22:38 IST

google News
  • ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి పాలైంది. టీమ్ ఇండియా విధించిన 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ ఛేదించింది.  క్లాసెన్ బ్యాటింగ్ మెరుపులతో నాలుగు వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను సౌతాఫ్రికా ఓడించింది.  

భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ (twitter)

భువనేశ్వర్ కుమార్

 అదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో  సౌతాఫ్రికా చేతిలో నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇండియా విధించిన 149 పరుగుల టార్గెట్ ను  సౌతాఫ్రికా మరో పది బంతులు మిగిలుండగానే ఛేదించింది. క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్ తో సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు. 149 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేదనను ఆరంభించిన సౌతాఫ్రికాను తొలి ఓవర్ లోనే భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. 

హెండ్రిక్స్ వికెట్ తీశాడు.   తర్వాత ప్రిటోరియస్, వాండర్ డుసెన్ వికెట్లు తీసి ఇండియాలో గెలుపు ఆశలను రేకెత్తించాడు. కానీ కెప్టెన్ బవుమా, క్లాసెన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. నిదానంగా ఆడుతూ విజయం దిశగా సౌతాఫ్రికాను నడిపించారు. పదో ఓవర్ వరకు నెమ్మదిగా ఆడిన క్లాసెన్ ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్లు ఫోర్లతో రెచ్చిపోయాడు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్ లో రెండు, ఫోర్లు, ఓ సిక్సర్ తో 19 పరుగులు రాబట్టాడు.  క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని చాహల్ విడగొట్టాడు. బవుమాను ఔట్ చేశాడు. బవుమా ఔట్ అయినా క్లాసెన్ జోరు తగ్గలేదు. చాహల్ వేసిన ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టాడు.  

46 బాల్స్ లోనే ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 81 రన్స్ చేసిన అతడిని హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. తొలి టీ20 మ్యాచ్ హీరో డేవిడ్ మిల్లర్ సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు.  సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో  కెప్టెన్ బవుమా 35, మిల్లర్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో పదమూడు పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. చాహల్, హర్షల్ పటేల్ తలో ఒక్క వికెట్ తీశారు. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో సౌతాఫ్రికా 2-0 ఆధిక్యంలో నిలిచింది. 

తదుపరి వ్యాసం