Sikandar Raza IPL Auction 2023: పంజాబ్ వాడినై పంజాబ్ తరఫున ఎంపికవడం ఆనందంగా ఉంది.. జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా
24 December 2022, 13:26 IST
- Sikandar Raza About IPL: జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా.. శుక్రవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో అతడు తన ఆనందాన్ని తెలియజేశాడు. పంజాబ్ వాడినైనా తాను పంజాబ్‌కు ఎంపిక కావడం ఆనందగా ఉందని తెలిపాడు.
సికిందర్ రజా
Sikandar Raza About IPL: జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా ఐపీఎల్‌వలో ఆడబోతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగుల్లో ఆడిన అతడు ఇంక ఇండియన్ ప్రీమియర్ లీగులోనూ ఆకట్టుకోనున్నాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు అతడి బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో 36 ఏళ్ల సికిందర్ రజా.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నడు. ఈ సందర్భంగా అతడు తన స్పందనను తెలియజేశాడు.
"నా రెజూమ్‌లో ఐపీఎల్ కూడా భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు దయ వల్ల ఇది జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇదే సమయంలో ఉత్కంఠగానూ ఉంది. నేను ఏ ఫ్రాంఛైజీకైనా ఆడతాను. కానీ పంజాబ్‌కు చెందిన నేను పంజాబ్ తరఫున ఆడటం ప్రత్యేకంగా భావిస్తున్నా." అని సికిందర్ రజా అన్నాడు.
వేలం జరుగుతున్నప్పుడు తను కొంచెం ఆందోళనకు గురైనట్లు సికిందర్ రజా చెప్పాడు. "నేను ఈ రోజు ట్రైనింగ్‌కు వెళ్లాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. కానీ ఇదే సమయంలో కొంచెం ఆందోళనకు గురయ్యాను. వేలానికి ముందు అన్ని రకాల భావోద్వేగాలను ఎదుర్కొన్నాను. వేలం సమయంలో హోటెల్‌కు తిరిగి వెళ్లాను. ఐపీఎల్ వేలంలో నా వంతు వచ్చింది. సరిగ్గా అప్పుడే నేను ఓ గది నుంచి మరొక గదికి మారుతున్నాను. అంతేకాకుండా ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ అయింది. ఇంటర్నెట్ తిరిగి కనెక్ట్ అయ్యేసరికి నా స్నేహితులకు నాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ మెసేజ్ చేస్తున్నారు. ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. ఓ సారి వేలాన్ని చూడమని చూపారు. కానీ అప్పుటికే నా బిడ్ అయిపోయింది. దీంతో నా వేలాన్ని నేను చూడలేకపోయాను. కానీ మంచికే జరిగిందనుకుంటున్నా." అని సికిందర్ రజా అన్నాడు.
పాకిస్థాన్ సియోల్ కోట్‌లో 1986లో జన్మించిన సికిందర్ రజా.. 2002లో జింబాబ్వేకు వలస వెళ్లాడ. అక్కడే మెరుగైన ప్రదర్శన చేసి జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు పొందిన విరాట్ కోహ్లీ రికార్డు అధిగమించాడు. సికిందర్ రజా 158 టీ20ల్లో 3109 పరుగులు చేశాడు. అంతేకాకుండా 79 వికెట్లను పడగొట్టాడు.
టాపిక్